News December 9, 2024
వారానికి నాలుగు రోజులే పని.. ఎక్కడంటే?
వారానికి నాలుగు రోజులే పనిచేసేలా కొత్త రూల్‌ను టోక్యో పరిచయం చేస్తోంది. పనిచేసే తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడం, దేశ సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జపాన్ జనాభా సంక్షోభం నేపథ్యంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను ఇంప్రూవ్ చేయడం, కుటుంబ వృద్ధిని ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం. అయితే, ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఈ రూల్‌పై మీ అభిప్రాయం ఏంటి?
Similar News
News January 15, 2025
యూపీలో తెలంగాణ బస్సుకు అగ్నిప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో 50 మంది TGలోని భైంసా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో పల్సికి చెందిన ప్రయాణికుడు మరణించాడు. మిగతావారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో బస్సుతో పాటు ప్రయాణికుల సామాగ్రి దగ్ధమైంది. వీరంతా కాశీకి వెళ్తున్నట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
News January 15, 2025
రేపు కనుమ.. ప్రత్యేకతలు ఇవే!
3 రోజుల సంక్రాంతి వేడుకల్లో రేపు కీలకమైన కనుమ. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులను ఈ రోజున అలంకరించి పూజించడం ఆనవాయితీ. ఏడాదంతా శ్రమించే వాటికి రైతులు ఇచ్చే గౌరవం ఇది. అలాగే కనుమనాడు మినప వడలు, నాటుకోడి పులుసుతో భోజనం తప్పనిసరి. కనుమ రోజు కాకులు కూడా కదలవని నానుడి. అందుకే పండక్కి వచ్చిన వారు రేపు తిరుగు ప్రయాణం చేయకూడదంటారు. 3 రోజులు పండుగను ఆస్వాదించిన తర్వాతే తిరిగెళ్లాలనేది సంప్రదాయం.
News January 14, 2025
తుది దశకు హమాస్-ఇజ్రాయెల్ వార్!
హమాస్-ఇజ్రాయెల్ మధ్య 15 నెలలుగా సాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గాజాలో శాంతి స్థాపన కోసం కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు. బందీల విడుదలకు హమాస్ ఓకే చెప్పిందని మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతర్ పేర్కొంది. 2023 OCT 7న హమాస్ మిలిటెంట్ల దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 47వేల మంది మరణించారు.