News August 6, 2024
మేకప్ వేసుకుని వర్కౌట్స్ చేస్తున్నారా?
మేకప్ వేసుకుని స్పోర్ట్స్ ఆడటం/వర్కౌట్స్ చేయడం చర్మానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మేకప్ పార్టికల్స్‌తో శరీరం నుంచి వచ్చే చెమట, వేడి కలిసిపోయి మలినాలను బంధిస్తాయని, దీని వల్ల చర్మంపై మొటిమలు, రంధ్రాలు ఏర్పడుతాయని, స్కిన్ అలర్జీస్ రావొచ్చని పేర్కొంటున్నారు. వర్కౌట్స్ అయ్యాక చెమట, మలినాలను తొలగించడానికి ముఖాన్ని సున్నితమైన, ఆయిల్ ఫ్రీ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News September 18, 2024
చైనా పౌరుడికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటూ అంతర్జాతీయ క్రైం రాకెట్ నడుపుతున్న చైనా పౌరుడికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. రెన్ చావోపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ పిటిషన్‌ను పరిగణించబోమని స్పష్టం చేసింది. నేరపూరిత కుట్ర ఆరోపణలపై రెన్ చావోను నోయిడా పోలీసులు 2022లో అరెస్టు చేశారు. వ్యాపారం చేసే విదేశీయులు భారత చట్టాలకు లోబడి ఉండాలని అలహాబాద్ హైకోర్టు గతంలో అతని బెయిల్ తిరస్కరించింది.
News September 18, 2024
చక్కటి ఆలోచన.. అడవిలో కంటైనర్ స్కూల్
TG: దట్టమైన అటవీ ప్రాంతం. భవన నిర్మాణానికి ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని బంగారుపల్లిలో కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేశారు. రూ.13 లక్షలతో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో తయారు చేసి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఇవాళ ఈ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ ఇదే.
News September 18, 2024
సీఎంకు చెక్కు అందజేసిన అనన్య
AP: విజయవాడ వరద బాధితుల కోసం తెలుగు హీరోయిన్ కొన్ని రోజుల క్రితం రూ.2.50 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చెక్కును అమరావతిలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. అటు తెలంగాణలోని వరద బాధితులకు సైతం ఈ హీరోయిన్ రూ.2.50 లక్షల విరాళం ప్రకటించారు.