News December 21, 2024

రూ.33,137కోట్లతో అమరావతిలో పనులు

image

AP రాజధాని అమరావతిలో రూ.33,137 కోట్లతో 40కి పైగా పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఇందులో రూ.768 కోట్లతో అసెంబ్లీ, రూ.1045 కోట్లతో హైకోర్టు, రూ.4688.83 కోట్లతో సచివాలయం, HOD భవనాలు, టవర్ల నిర్మాణం, మంత్రులు, న్యాయమూర్తులు, కార్యదర్శుల స్థాయి అధికారులకు నివాస భవనాల నిర్మాణం వంటివి చేపట్టనున్నారు.

Similar News

News January 15, 2025

చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందే: CM రేవంత్

image

TG: రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీ నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జల్‌శక్తి శాఖ, GRMB, KRMB, AP CMకు లేఖలు రాయాలని చెప్పారు.

News January 15, 2025

కేంద్ర మంత్రులతో శ్రీధర్‌బాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

image

TG: కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గజేంద్ర సింగ్‌తో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణకు సహకరించాలని వైష్ణవ్‌ను కోరారు. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, రామగిరి ఫోర్ట్‌ల అభివృద్ధికి సహకరించాలని గజేంద్ర సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

News January 15, 2025

ఈ OTTలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్ట్రీమింగ్!

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది. నవ్వులు పూయించే ఈ సినిమాను చూసేందుకు వృద్ధులు సైతం థియేటర్‌కు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘ZEE5’దక్కించుకుంది. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇంతకీ మీరు ఈ సినిమా చూశారా?