News April 12, 2024

నాకు IPL కంటే వరల్డ్ కప్ ముఖ్యం: జంపా

image

IPL2024 నుంచి వైదొలగడంపై ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్పందించారు. తనకు IPL కంటే వరల్డ్ కప్ ముఖ్యమన్నారు. రాబోయే T20WC కోసం మానసికంగా, ఫిట్నెస్ పరంగా సన్నద్ధమయ్యేందుకే ఈ సీజన్ నుంచి తప్పుకున్నానన్నారు. ఆస్ట్రేలియా జట్టులో స్థానం కోసం చూస్తున్న తాను కీలకమైన 9వారాలు ఇండియాలో ఐపీఎల్ కోసం వెచ్చించలేనన్నారు. 2023లో రాజస్థాన్ తరఫున బరిలోకి దిగిన జంపా కేవలం 8 వికెట్లు తీసి ఘోరంగా విఫలమయ్యారు.

Similar News

News July 6, 2025

ప్రభాస్‌తో రణ్‌వీర్ బాక్సాఫీస్ క్లాష్?

image

ప్రభాస్‌తో బాక్సాఫీస్ క్లాష్‌కి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ రెడీ అవుతున్నట్లు బీ టౌన్‌లో వార్తలొస్తున్నాయి. ఇవాళ రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా ‘దురంధర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజవుతోంది. ఈ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్‌తో పోటీకి దిగుతారా? అనేది వేచిచూడాలి.

News July 6, 2025

‘అమెరికా పార్టీ’ స్థాపిస్తున్న ఎలాన్ మస్క్

image

‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’ పాసైతే మూడో పొలిటికల్ పార్టీ పెడతానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో పార్టీపై ట్విట్టర్‌లో రెండోసారి పోల్ పెట్టగా.. 12.48 లక్షల ఓట్లొచ్చాయి. 65.4% మంది మూడో పార్టీకి ఓటేశారు. ఈ నేపథ్యంలోనే “రెండు పార్టీలు ఒక్కటే అన్న అభిప్రాయంతో మీరు కొత్త పార్టీ కోరుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు ఇవాళ ‘అమెరికా పార్టీ’ రూపుదిద్దుకుంది’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.

News July 6, 2025

ప్రపంచంలో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న YouTube ఛానళ్లు ఇవే..

image

1.MrBeast (అమెరికా)- 411 మిలియన్లు
2.T-Series (ఇండియా)- 298 మి.
3.Cocomelon – Nursery Rhymes (అమెరికా)- 195 మి.
4.SET India (భారత్)- 185.1 మి.
5.Vlad and Niki (అమెరికా)- 142 మి.
6.Kids Diana Show (అమెరికా)- 135 మి.
7.Like Nastya (అమెరికా)- 128 మిలియన్లు
8.Stokes Twins (అమెరికా)- 128 మి.
9.Zee Music Company (భారత్)- 114 మి.
10.PewDiePie (జపాన్/స్వీడన్)- 111 మి.