News March 26, 2025
వరల్డ్ పర్పుల్ డే!

ఈరోజు ‘వరల్డ్ పర్పుల్ డే’. దీన్ని మూర్ఛవ్యాధి అవగాహన దినోత్సవం అని కూడా పిలుస్తుంటారు. మూర్ఛ గురించి అవగాహన పెంచడానికి, ఆ వ్యాధి గురించి ప్రజల్లో ఉన్న అపోహలు& భయాలను తొలగించడానికి ప్రతి ఏటా మార్చి 26న ఈ డేని నిర్వహిస్తారు. WHO ప్రకారం 50 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. దీని బారిన పడిన కెనడాకు చెందిన కాసెడీ మేగాన్ 2008లో ‘పర్పుల్ డే’ను తీసుకొచ్చారు.
Similar News
News April 23, 2025
కొత్త పెన్షన్లు.. అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం

TG: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రెడీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. వీటిపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 43 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 ఇస్తున్నారు.
News April 23, 2025
ఫెయిలై ఒకరు.. తక్కువ మార్కులొచ్చాయని మరొకరు సూసైడ్

AP: ఇద్దరు టెన్త్ విద్యార్థులు సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. కృష్ణా(D) అర్జువానిగూడెంకు చెందిన G.అనిల్ గతేడాది, ప్రస్తుతం సైన్స్ పరీక్షలో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని చనిపోయాడు. శ్రీకాకుళంలోని బలగ ప్రాంతానికి చెందిన G.వేణుగోపాలరావుకు ఇవాళ టెన్త్ ఫలితాల్లో 393 మార్కులొచ్చాయి. తక్కువ మార్కులొచ్చాయని ఉరేసుకొని మృతిచెందగా, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 23, 2025
గవర్నమెంట్ స్కూల్.. 600కు 598 మార్కులు

AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో మెరిశారు. పల్నాడు(D) ఒప్పిచర్ల జడ్పీ స్కూల్ విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు తెచ్చుకుంది. హిందీ, ఇంగ్లిష్‌లో 99 మార్కుల చొప్పున వచ్చాయి. అన్నమయ్య(D) పెద్దవీడు, ప్రకాశం (D) అలకూరపాడు ZP స్కూల్స్ విద్యార్థినులు మేఘ, వెంకట భార్గవికి 595 మార్కులు వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివి అత్యధిక మార్కులు తెచ్చుకున్న వీరిపై ప్రశంసలు వస్తున్నాయి.