News August 16, 2024
5 నెలలకే పుట్టి, స్కూల్ హాజరులో వరల్డ్ రికార్డ్
AP: పల్నాడు(D) సత్తెనపల్లి వాసి మస్తాన్, షీబా(కేరళ) దంపతులకు ఐదో నెలలోనే బాలిక అయత్ జన్మించింది. కేవలం 500 గ్రాముల బరువు ఉండటం, అవయవాలు పూర్తిగా రూపుదాల్చకపోవడంతో ప్రత్యేక వైద్య పరికరాల సాయంతో బిడ్డను కాపాడుకున్నారు. ప్రస్తుతం బాలిక కేరళలో LKG చదువుతోంది. 2023-24లో 197 రోజులు తరగతులు నిర్వహించగా అన్ని రోజులూ హాజరైంది. దీంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా 4 రికార్డుల్లో చోటు దక్కించుకుంది.
Similar News
News September 13, 2024
నేనొక సీరియల్ డేటర్: రెజీనా
ఇప్పటివరకు తాను ఎంతో మందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని హీరోయిన్ రెజీనా తెలిపారు. ‘ఉత్సవం’ ప్రమోషన్లలో తన లవ్ స్టోరీస్ గురించి ఆమె మాట్లాడారు. ‘నేను సీరియల్ డేటర్‌ను. చాలా మందితో రిలేషన్ కొనసాగించా. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నా. సందీప్ కిషన్‌తో నాకు అఫైర్ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం’ అని ఆమె చెప్పారు. కాగా చాలా రోజుల తర్వాత రెజీనా ‘ఉత్సవం’ మూవీలో నటించారు.
News September 13, 2024
అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు?
AP: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అక్టోబర్‌లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
News September 13, 2024
ALERT.. మళ్లీ వర్షాలు
AP: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ప.బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది. APపై ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.