News March 3, 2025
వరల్డ్ వైల్డ్ లైఫ్ డే.. PM మోదీ సఫారీ

వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా గుజరాత్‌లోని GIR నేషనల్ పార్క్‌లో PM మోదీ సఫారీకి వెళ్లారు. కెమెరాతో సింహాలను ఫొటోలు తీశారు. గతంలో తాను CMగా ఉన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని ట్వీట్ చేశారు. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తాము తీసుకున్న చర్యల వల్ల ఆసియా సింహాల జనాభా క్రమంగా పెరుగుతోందని తెలిపారు. జంతువుల సంరక్షణకు అటవీ పరిసర ప్రాంత ప్రజలు కూడా కృషి చేయడం ప్రశంసనీయమన్నారు.
Similar News
News February 2, 2026
జాబ్ క్యాలెండర్: ఖాళీ పోస్టులపై కసరత్తు

AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చి, దాని ప్రకారం పోస్టులు భర్తీ చేయడానికి GOVT శాఖల వారీ ఖాళీలపై కసరత్తు చేపట్టింది. రెవెన్యూలో 13,000, విద్యలో 7,000, వర్సిటీల్లో 3000 ఖాళీలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. PRలో 26,000, మున్సిపల్‌లో 26,800, అగ్రికల్చర్‌లో 3,000, స్కిల్ డెవలప్‌మెంట్‌లో 4,200 ఖాళీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర శాఖల వివరాలూ తెప్పిస్తున్నారు. కాగా 90,000 వరకు ఖాళీలుండొచ్చని అంచనా.
News February 2, 2026
ఎర్రజెండా.. ప్రజల గళం: CM రేవంత్ ‘రెడ్’ మార్క్ పాలిటిక్స్!

TG: ప్రజల పక్షాన నిలిచి వాళ్ల గళం వినిపించే పార్టీ ఎర్రజెండా అని CM రేవంత్ రెడ్డి కొనియాడారు. కనీస వేతన చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి కమ్యూనిస్టుల ఎన్నో డిమాండ్లను కాంగ్రెస్ పరిష్కరించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఒకే నాణేనికి రెండు వైపులా ఉండే పార్టీల్లా ప్రజలు భావిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ CPIతో దూరం పెరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
News February 2, 2026
BJP ఏజెంట్‌లా EC పనిచేస్తోంది: మమతా

వెస్ట్ బెంగాల్ CM మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. CEC జ్ఞానేశ్ కుమార్‌తో మీటింగ్ అనంతరం ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా 58 లక్షల మంది పేర్లను తొలగించారని ఆరోపించారు. ఈ కమిషన్ BJP ఏజెంట్‌లా పనిచేస్తోందని విమర్శించారు. మరోవైపు TMC కార్యకర్తలు అధికారులపై దాడులు చేస్తున్నారని, BLOలకు గౌరవ వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని EC పేర్కొంది.


