News March 3, 2025
వరల్డ్ వైల్డ్ లైఫ్ డే.. PM మోదీ సఫారీ

వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా గుజరాత్‌లోని GIR నేషనల్ పార్క్‌లో PM మోదీ సఫారీకి వెళ్లారు. కెమెరాతో సింహాలను ఫొటోలు తీశారు. గతంలో తాను CMగా ఉన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని ట్వీట్ చేశారు. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తాము తీసుకున్న చర్యల వల్ల ఆసియా సింహాల జనాభా క్రమంగా పెరుగుతోందని తెలిపారు. జంతువుల సంరక్షణకు అటవీ పరిసర ప్రాంత ప్రజలు కూడా కృషి చేయడం ప్రశంసనీయమన్నారు.
Similar News
News March 27, 2025
DANGER: అధికంగా సౌండ్స్ వింటున్నారా?

చుట్టూ ఉన్న ముప్పును మనం గుర్తించలేకపోతున్నాం. సౌండ్ పొల్యూషన్ ఎంతో ప్రమాదకరం. ఏళ్లుగా అధిక సౌండ్స్ వింటున్నట్లైతే అనారోగ్యపడినట్లే. ఇలాంటి వారికి గుండెపోటు, హైబీపీ, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌లో శబ్ద కాలుష్యం కారణంగా ఏటా 12000 మంది చనిపోతుండగా లక్షల మందికి నిద్రలేమి సమస్యలొస్తున్నాయి. 55-60 డెసిబెల్స్ దాటిందంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది.
News March 27, 2025
ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్

TG: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని చట్టంలో ఉందని, కానీ పెంచలేదని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే పెంచలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించలేదు. దీంతో దక్షిణాది నుంచి లోక్‌సభలో 24 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఉమ్మడి పోరాటం చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
News March 27, 2025
జనాభా ఒక్కటే ప్రామాణికం కాదు: సీఎం రేవంత్

TG: నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని CM రేవంత్ అన్నారు. డీలిమిటేషన్‌పై CM అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ‘డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా నియంత్రణ ఆ రాష్ట్రాలకు శాపంగా మారకూడదు. అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలి. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్‌ను వాజ్‌పేయి కూడా వ్యతిరేకించారు’ అని గుర్తు చేశారు.