News June 25, 2024
ఏపీలో ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆస్ట్రిచ్ గూడు!

ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆస్ట్రిచ్ గూడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో బయటపడింది. పలు దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి గుజరాత్‌లోని వడోదర యూనివర్సిటీ నిపుణులు చేపట్టిన తవ్వకాల్లో ఇది వెలుగుచూసింది. అందులో 911 గుడ్లకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని వారు తెలిపారు. భారత్ ఒకప్పుడు వైవిధ్యమైన ఎన్నో జీవజాతులకు ఆలవాలంగా ఉండేదని చెప్పేందుకు ఈ గూడు ఓ నిదర్శనమని వివరించారు.
Similar News
News July 6, 2025
NFDBని అమరావతికి తరలించండి: చంద్రబాబు

AP: HYDలో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(NFDB)ను అమరావతికి తరలించాలని CM చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ‘గతంలో దేశ మత్స్య రంగంలో AP పాత్ర గుర్తించి ఈ బోర్డును HYDలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయినా ఆక్వా ఉత్పత్తుల్లో APదే కీలక వాటా. రూ.19,420 కోట్ల ఎగుమతులతో దేశానికి నాయకత్వం వహిస్తోంది. సుదీర్ఘ తీరం, రొయ్యల పరిశ్రమ ఉన్న APలో దీని ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి’ అని వివరించారు.
News July 6, 2025
148 ఏళ్లలో తొలిసారి.. చరిత్ర సృష్టించాడు

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పరుగుల వరద పారించిన టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ <<16956685>>రికార్డుల<<>> మోత మోగించారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో 250 ప్లస్, 150 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా ఆయన ఖ్యాతి గడించారు. గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, శతకం బాదిన తొలి ప్లేయర్‌గానూ అతడు రికార్డులకెక్కారు.
News July 6, 2025
రెండ్రోజుల్లో శ్రీశైలం గేట్లు ఓపెన్!

AP: శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 1.88 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 878 అడుగుల నీరు ఉంది. దీంతో 8, 9 తేదీల్లో గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది.