News January 4, 2025

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత

image

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, జపాన్ మహిళ టోమికో ఇటూకా(116) కన్నుమూశారు. 2019 నుంచి ఈమెను ఒసాకా సిటీలోని నర్సింగ్ హోమ్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో DEC 29న మరణించినట్లు అధికారులు ప్రకటించారు. 1908 మే23న ఒసాకాలో జన్మించిన ఈమెకు నలుగురు పిల్లలు, ఐదుగురు మనవళ్లు ఉన్నారు. స్పెయిన్‌కు చెందిన మరియా(117) గత ఏడాది మరణించడంతో ఇటూకా ఓల్డెస్ట్ మహిళగా గుర్తింపు పొందారు.

Similar News

News January 16, 2025

3 రోజులు జాగ్రత్త

image

TGలో చలి తీవ్రత మరో మూడు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పొగమంచు ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో APలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

News January 16, 2025

విషాదం.. ప్రకృతి వైపరీత్యాలకు 3,200 మందికి పైగా మృతి

image

దేశంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా 3,200 మందికిపైగా మరణించినట్లు వాతావరణ వార్షిక నివేదిక-2024 పేర్కొంది. అత్యధికంగా 1,374 మంది పిడుగుపాటుకు గురై మరణించగా, వరదల వల్ల 1,287 మంది, వడదెబ్బ కారణంగా 459 మంది చనిపోయారని వెల్లడించింది. వరదలతో అత్యధికంగా కేరళలో, పిడుగుపాటుతో బిహార్‌లో మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు గత ఏడాది అత్యధిక ఉష్ణ సంవత్సరంగా నిలిచింది.

News January 16, 2025

కొత్త పథకాలు.. నేటి నుంచే ఫీల్డ్ సర్వే

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తీసుకురానున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం నేటి నుంచి ఫీల్డ్ సర్వే చేయనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. దీని ఆధారంగా 25న తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.