News July 8, 2024
మట్టి వినాయకులను పూజించండి: పవన్

AP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయకచవితికి మట్టి గణపతులనే పూజించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘మట్టి గణపతులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రయోగాత్మకంగా పిఠాపురంలో మట్టి వినాయకులను పూజించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్‌తో కాకుండా చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలి’ అని తనను కలిసిన పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్‌తో పవన్ వ్యాఖ్యానించారు.
Similar News
News February 3, 2026
గాజువాక: సచివాలయ ఉద్యోగిని పట్టుకున్న ఏసీబీ

గాజువాకలోని 74వ వార్డులో సచివాలయం అడ్మిన్ కార్యదర్శి రూ.16 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం సాయంత్రం నిఘా పెట్టి ఏసీబీ అధికారులు దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
News February 3, 2026
భారత్‌పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు శుభవార్త చెప్పారు. టారిఫ్‌లు 25% నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇవాళ PM మోదీతో మాట్లాడా. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. శక్తిమంతమైన నాయకుడు. రష్యన్ చమురు కొనుగోలును ఆపడానికి, US, వెనిజులా నుంచి కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది’ అని ట్రూత్‌లో పోస్టు చేశారు.
News February 3, 2026
నొప్పి ఎక్కడో మాత్రకు ఎలా తెలుస్తుంది?

నిజానికి నొప్పి ఎక్కడుందో మాత్ర కనిపెట్టదు. అది రక్తంలో కలిసి శరీరమంతా ప్రయాణిస్తుంది. అయితే మనకు నొప్పి ఉన్నచోట ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. మాత్రలోని మందు రక్తం ద్వారా ఆ రసాయనాలు ఉత్పత్తి అవుతున్న చోటుకు కూడా వెళ్తాయి. నొప్పి సంకేతాలు మెదడుకు చేరకుండా అక్కడ అడ్డుకుంటాయి. అలా మనకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పెయిన్ కిల్లర్ ఆ శరీర భాగంలో ఉన్న అసలు సమస్యను పరిష్కరించలేదు.


