News April 4, 2024

శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ.. మయాంక్ యాదవ్ నాన్‌వెజ్ మానేశాడు: తల్లి మమత

image

IPLలో అదరగొడుతోన్న మయాంక్ యాదవ్(LSG) ప్రదర్శన చూసి పేరెంట్స్ మురిసిపోతున్నారు. అతను త్వరలోనే IND జట్టుకు ఆడతాడని, మెరుగ్గా రాణిస్తాడని తల్లి మమతా యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మయాంక్ డైట్ గురించి చెబుతూ.. ‘గతంలో మాంసం తినేవాడు. శ్రీకృష్ణుడిని ఆరాధించడం మొదలుపెట్టాక మానేశాడు. నాన్‌వెజ్ తన బాడీకి సెట్ కావట్లేదన్నాడు. ఇప్పుడు వెజిటేరియన్‌గా మారాడు. రోటి, పప్పు, రైస్, కూరగాయలు తింటున్నాడు’ అని తెలిపారు.

Similar News

News November 18, 2025

తెలంగాణ న్యూస్ అప్డేట్స్

image

*ఈ నెల 25న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ. 50% రిజర్వేషన్‌పై నివేదిక ఇవ్వాలని డెడికేషన్ కమిషన్‌కు క్యాబినెట్ సిఫార్సు.
* రైతులు, మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రానికి రావాలని సీసీఐకి మంత్రి తుమ్మల విజ్ఞప్తి.
* అసదుద్దీన్ ఒవైసీ మాతో కలిసి ఉన్నా లేకపోయినా చేతి గుర్తుకు మద్దతు ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి ఉన్నామని చెప్పకనే చెప్పారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతాయి: PCC చీఫ్ మహేశ్ కుమార్

బిహార్ కొత్త ఎమ్మెల్యేల్లో 40% మందికి డిగ్రీల్లేవ్

image

బిహార్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో దాదాపు 40 శాతం మందికి డిగ్రీ కూడా లేదు. 32 శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. పీజీ చేసిన వాళ్లు 28 శాతం ఉన్నారు. 192 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేయగా 111 మంది మళ్లీ గెలిచారు. ఇక 12 శాతం మంది మహిళలు (29) ఎన్నికయ్యారు. గతేడాదితో పోలిస్తే (26) కాస్త ఎక్కువ. ఈ విషయాలను PRS Legislative Research సంస్థ తాజాగా వెల్లడించింది.