News April 4, 2024
శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ.. మయాంక్ యాదవ్ నాన్‌వెజ్ మానేశాడు: తల్లి మమత
IPLలో అదరగొడుతోన్న మయాంక్ యాదవ్(LSG) ప్రదర్శన చూసి పేరెంట్స్ మురిసిపోతున్నారు. అతను త్వరలోనే IND జట్టుకు ఆడతాడని, మెరుగ్గా రాణిస్తాడని తల్లి మమతా యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మయాంక్ డైట్ గురించి చెబుతూ.. ‘గతంలో మాంసం తినేవాడు. శ్రీకృష్ణుడిని ఆరాధించడం మొదలుపెట్టాక మానేశాడు. నాన్‌వెజ్ తన బాడీకి సెట్ కావట్లేదన్నాడు. ఇప్పుడు వెజిటేరియన్‌గా మారాడు. రోటి, పప్పు, రైస్, కూరగాయలు తింటున్నాడు’ అని తెలిపారు.
Similar News
News December 8, 2024
మహాయుతి గెలుపుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది: పవార్
మహారాష్ట్ర ఎన్నికల్లో ‘మహాయుతి’ గెలుపుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని NCP(SP) చీఫ్ శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ధైర్యాన్ని కోల్పోకూడదని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. ‘మనం ఓడిన మాట నిజమే. దానిపై ఎక్కువ చింతించడం వల్ల ఉపయోగం లేదు. తిరిగి ప్రజల్లోకి వెళ్లాలి’ అని హితబోధ చేశారు. ఎంవీఏ కూటమిని సమాజ్‌వాదీ పార్టీ వీడటాన్ని పవార్ తోసిపుచ్చారు. ప్రతిపక్ష ఐక్యత కీలకమని అఖిలేశ్ భావిస్తున్నారని తెలిపారు.
News December 8, 2024
బోల్ట్ రికార్డ్ బద్దలుకొట్టిన గౌట్
పరుగు పందెం అనగానే మనందరికీ జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు. ఒలింపిక్స్‌లో ఈ అథ్లెట్ నెలకొల్పిన రికార్డులు అలాంటివి మరి. తాజాగా, బోల్ట్ రికార్డును ఆస్ట్రేలియా స్ప్రింటర్ గౌట్ బద్దలుకొట్టారు. ఆస్ట్రేలియన్ స్కూల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 200మీ. పరుగును 20.04 సె.లో పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డ్ బోల్ట్ పేరిట (20.13సె) ఉండేది. రానున్న ఒలింపిక్స్‌లో గౌట్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనున్నారు.
News December 8, 2024
టెన్త్, ఇంటర్ పాసైన వారికి గుడ్‌న్యూస్
TG: సికింద్రాబాద్‌లోని జోగిందర్ స్టేడియం, AOC సెంటర్‌లో 2025 JAN 6 నుంచి MAR 9 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. జనరల్ డ్యూటీ, ఆఫీస్ అసిస్టెంట్, చెఫ్, ట్రేడ్స్‌మెన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. జనరల్ డ్యూటీ, ట్రేడ్స్‌మెన్‌కు టెన్త్, ఆఫీస్ అసిస్టెంట్‌కు ఇంటర్ పాసైన వారు అర్హులు. వయసు 17-21 ఏళ్లు ఉండాలి. వివరాలకు tuskercrc2021@gov.in మెయిల్, joinindianarmy@nic.inను సందర్శించండి.