News June 2, 2024
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో చెత్త రికార్డు
కెనడా ఫాస్ట్ బౌలర్ జెరెమీ గోర్డాన్ టీ20 వరల్డ్ కప్‌లో చెత్త రికార్డు నమోదు చేశారు. USAతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో ఏకంగా 33 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా నిలిచారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ తొలి స్థానంలో ఉన్నారు. 2007 T20 WCలో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్ ఒకే ఓవర్‌లో 36 పరుగులు ఇచ్చారు.
Similar News
News September 14, 2024
విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం: KTR
TG: విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. ‘అన్ని రాష్ట్రాల్లో MBBS, BDS అడ్మిషన్లు కొనసాగుతున్నా ఇక్కడ మాత్రం జరగటం లేదు. తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్‌గా మార్చే కుట్ర జరుగుతోంది. స్థానికతపై ప్రభుత్వం ఎందుకు వివాదాస్పదం చేస్తోంది? BRS రాష్ట్రాన్ని డాక్టర్ల ఫ్యాక్టరీగా మారిస్తే కాంగ్రెస్ దానికి తూట్లు పొడుస్తోంది’ అని ఆయన ఎక్స్‌లో ఫైర్ అయ్యారు.
News September 14, 2024
రీరిలీజ్‌కు సిద్ధమైన ‘జర్నీ’
శర్వానంద్, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రలు పోషించిన ‘జర్నీ’ మూవీ రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఈ నెల 21న 4కే వెర్షన్‌లో రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఎం.శరవణన్ తెరకెక్కించిన ఈ మూవీకి సి.సత్య మ్యూజిక్ అందించారు. కాగా ఈ సినిమా 2011 డిసెంబర్ 16న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
News September 14, 2024
త్వరలో అకౌంట్లోకి డబ్బులు
TG: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రేషన్ కార్డు లేని 3 లక్షల మంది రైతుల వివరాలను గ్రామాల వారీగా అధికారులు పరిశీలిస్తున్నారని, ఈ నెలాఖరులోగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేసి రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ పూర్తయ్యాకే రైతుభరోసా డబ్బులు జమ చేస్తామన్నారు.