News November 28, 2024
దారుణం: పసికందును బాత్రూమ్‌లో ఫ్లష్ చేశారు!

పసికందును బాత్రూమ్ కమోడ్‌లో పడేసి ఫ్లష్ చేసిన అమానుష ఘటన కర్ణాటకలోని హరోహళిలో చోటుచేసుకుంది. కమోడ్‌లో నీరు నిలిచిపోవడంతో కార్మికులు శుభ్రం చేస్తుండగా బిడ్డ మృతదేహాన్ని గుర్తించారు. పసిగుడ్డుకు 2 రోజుల వయసుంటుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన వారెవరో ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<
News March 5, 2026
రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.
News March 5, 2026
‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.


