News October 26, 2024

అరెస్ట్ చేయకపోయినా పొత్తు ఉండేదేమో: చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వ హయాంలో తనను అరెస్ట్ చేయకపోయినా కూటమి పొత్తు ఏర్పడేదేమో అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘మనం నిమిత్తమాత్రులమే. విధి స్పష్టంగా ఉంటుంది. అరెస్ట్ చేయకపోయినా పొత్తు ఉండేదేమో. నా అరెస్ట్ పొత్తు నిర్ణయానికి మరింత ఊతమైంది. సరైన సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేశారు’ అని అన్నారు.

Similar News

News October 26, 2024

UNSC: పాక్‌ను మళ్లీ ఉతికారేసిన భారత్

image

UNSCలో పాక్‌ను భారత్ మరోసారి ఉతికారేసింది. కీలక డిబేట్‌లో కశ్మీర్లో మహిళల అంశాన్ని లేవనెత్తడంపై సీరియస్ అయింది. ఇది వారి అబద్ధాల వ్యాప్తి వ్యూహం ఆధారంగా చేపట్టిన రెచ్చగొట్టే చర్యగా వర్ణించింది. ‘పాక్ సంబంధం లేని పొలిటికల్ ప్రాపగండాకు దిగింది. మీ దేశంలో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు సహా మైనారిటీ మహిళల దుస్థితేంటో అందరికీ తెలుసు’ అని UNలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ పర్వతనేని హరీశ్ అన్నారు.

News October 26, 2024

అమెరికాలో లోకేశ్‌కు ఘన స్వాగతం

image

APకి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికా వెళ్లిన మంత్రి లోకేశ్‌కు శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. నవంబర్ 1 వరకు అమెరికాలోనే ఉండనున్న మంత్రి రేపటి నుంచి పలు ఐటీ, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని వారికి వివరించనున్నారు. ఈ నెల 29న లాస్ వేగాస్‌లో జరిగే ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరవుతారు.

News October 26, 2024

సోదరుడిని స్వయంగా పోలీసులకు అప్పగించిన మాజీ మంత్రి

image

TG: ఓ కేసులో నిందితుడిగా ఉన్న తన సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పోలీసులకు అప్పగించారు. MBNR జిల్లా ఆదర్శ్‌నగర్‌లోని ప్రభుత్వ భూములు, డబుల్ బెడ్రూం ఇళ్లను తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించారని నలుగురిపై కేసు నమోదైంది. వారిలో ఉన్న శ్రీకాంత్ గౌడ్‌ పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే నిన్న ఆయనను శ్రీనివాస్ గౌడ్ కారులో తీసుకొచ్చి PSలో అప్పగించారు.