News August 26, 2024
WOW: 18 బంతుల్లో 15 డాట్స్

భారత యువ పేస్ బౌలర్ యశ్ దయాల్ యూపీ టీ20 లీగ్‌లో అదరగొట్టారు. 3 ఓవర్లు బౌలింగ్ చేసి అందులో ఏకంగా 15 డాట్ బాల్స్ వేశారు. ఒక మెయిడిన్ వేసి మొత్తంగా 3 పరుగులే ఇచ్చారు. వికెట్లేమీ పడకున్నా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో నోయిడా సూపర్ కింగ్స్‌పై యశ్ జట్టు(గోరఖ్‌పుర్ లయన్స్) గెలిచింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం ఉన్న నేపథ్యంలో దయాల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుందా? అనే చర్చ మొదలైంది.
Similar News
News January 20, 2026
మన ఆయుష్షు తగ్గించే కొన్ని అపవిత్ర పనులు

కొన్ని అలవాట్లు మన ఆయుష్షును తగ్గిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. దాని ప్రకారం.. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవకపోతే స్వచ్ఛమైన గాలి అందక అనారోగ్యం కలుగుతుంది. రాత్రిపూట పెరుగు, దాంతో చేసినవి తింటే వ్యాధులు రావొచ్చు. దక్షిణ, పడమర దిశలో తలపెట్టి నిద్రించడం, శ్మశానంలో మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు వచ్చే విష వాయువు పీల్చడం హానికరం. స్త్రీలు, పిల్లలు, మానవత్వం పట్ల చెడు ఆలోచనలు ఉంటే ఆయుష్షు క్షీణిస్తుంది.
News January 20, 2026
హ్యాట్సాఫ్.. రూ.2కోట్ల ఆస్తిని దానం చేశారు

AP: నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలులేని ఈ దంపతులు తమ యావదాస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళమిచ్చారు. దాదాపు రూ.2కోట్ల విలువజేసే ఆస్తి ఆలయానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్క రూపాయి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అంత ఆస్తిని గుడికి రాసిచ్చేసిన ఈ దంపతులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
News January 20, 2026
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ఆదేశాలు

TG గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2025 JAN 1 నుంచి DEC 31 మధ్య CBFC ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. కొత్తగా ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ అవార్డు, ప్రత్యేక విభాగంలో డా.సి.నారాయణరెడ్డి అవార్డులను అందజేయనున్నారు. ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.


