News April 9, 2024

వావ్.. అద్భుతమైన ఫొటోలు

image

అత్యంత అరుదైన సంపూర్ణ సూర్య గ్రహణం నిన్న ప్రజలకు కనువిందు చేసింది. అమెరికా, మెక్సికో, కెనడా, యూకే, ఐర్లాండ్ దేశాల్లో దాదాపు 4 నిమిషాల 28 సెకన్ల పాటు కొనసాగింది. 50 ఏళ్లలో ఇదే అత్యంత సుదీర్ఘ గ్రహణం. ఈ అద్భుతమైన ఫొటోలను నాసా సహా అనేక స్పేస్ ఏజెన్సీలు చిత్రీకరించాయి. వాటిని మీరూ వీక్షించండి.

Similar News

News April 19, 2026

చిన్న పొరపాటు చేసినా తీవ్రస్థాయిలో దాడి: ఇరాన్

image

అమెరికాతో దౌత్యానికైనా, పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ స్పష్టం చేశారు. తాము యుద్ధంలో గెలిచేశామని, ఇప్పుడు చర్చలకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, చిన్న పొరపాటు చేసినా తీవ్ర స్థాయిలో బదులిస్తామన్నారు. గత సంఘర్షణలతో పోలిస్తే ఇరాన్ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు.

News April 19, 2026

మరోసారి తల్లి కాబోతోన్న దీపికా పదుకొణె

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతున్నారు. తాను ప్రెగ్నెంట్ అని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. తన కూతురు దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. రణ్‌వీర్ సింగ్, దీపిక 2018లో వివాహం చేసుకోగా, 2024లో కూతురు జన్మించిన సంగతి తెలిసిందే.

News April 19, 2026

ఇంటర్ సెకండియర్‌కూ ఇంప్రూవ్‌మెంట్.. ఫీజు ఎంతంటే?

image

AP: ఈ ఏడాది నుంచి ఇంటర్ సెకండియర్ ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం <<19683959>>ఇంప్రూవ్‌మెంట్<<>> రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు రూ.600 ఫీజుతోపాటు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాలని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇటీవల పబ్లిక్ పరీక్షలకు కేటాయించిన ఐడీ నంబరుతోనే రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా సప్లిమెంటరీ పరీక్షలకూ రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు.