News September 18, 2024

WOW.. పంచెకట్టులో బాలయ్య

image

నందమూరి బాలకృష్ణ కొత్త లుక్‌లో కనిపించారు. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘NBK109’ సినిమా షూటింగ్‌ స్పాట్‌కు ‘పైలం పిలగా’ చిత్రయూనిట్ వెళ్లింది. ఈనెల 20వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ కోసం ట్రైలర్‌ను బాలయ్యకు చూపించారు. ఈ సందర్భంగా పంచెకట్టులో హ్యాండ్సమ్‌గా బాలయ్య కనిపించారు. బాలయ్య రోజురోజుకూ యూత్‌గా మారుతున్నారని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News October 11, 2024

ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తు గడువు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. ఇప్పటివరకు మొత్తం 90 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల ద్వారా రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈ నెల 14న లాటరీ తీసి విజేతలను నిర్ణయిస్తారు. 15నాటికి దుకాణాన్ని వారికి అప్పగిస్తారు. 16 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుంది. కాగా రాష్ట్రంలో 3,396 వైన్ షాపులు ఉన్నాయి.

News October 11, 2024

దేవర-2పై డైరెక్టర్ క్రేజీ కామెంట్స్

image

దేవర-2లో నటీనటులపై డైరెక్టర్ కొరటాల శివ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ ఉంటే బాగుంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అది జరుగుతుందో లేదో తెలియదన్నారు. బాలీవుడ్ స్టార్లను అతిథి పాత్రలకు తీసుకోవడం తనకు ఇష్టముండదని, ముఖ్యమైన క్యారెక్టర్‌‌లే ఇస్తానని పేర్కొన్నారు. నటించబోయే వారి వివరాలను త్వరలోనే పాత్రలవారీగా వెల్లడిస్తామని తెలిపారు.

News October 11, 2024

Jobs Info: ఆఫర్ లెటర్స్ పంపడం ఆపేస్తున్న ఇన్ఫోసిస్

image

Infosys హైరింగ్ ప్రాసెస్ మొత్తం మార్చేస్తోందని సమాచారం. జాబ్ ఆఫర్లు, అటాచ్‌మెంట్లను ఈ-మెయిళ్లకు పంపించదు. ఇకపై ఉద్యోగార్థులే కంపెనీ ఇంటర్నల్ సిస్టమ్స్‌లో లాగినై అప్లికేషన్‌ డీటెయిల్స్‌ను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మోసాలు, స్కామ్‌లు జరగకుండా, హైరింగ్ ప్రాసెస్‌ను మరింత సౌకర్యంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. https://career.infosys.com/offerValidationలోనే ఆఫర్ లెటర్లు ఇవ్వనుంది.