News January 4, 2025
వామ్మో కాన్‌కాల్స్! ఫ్యామిలీ లైఫ్ బిల్‌కుల్ మిస్!
BFSI, మార్కెటింగ్ ఇండస్ట్రీస్‌లో కాన్‌కాల్స్ సహజం. టార్గెట్లను ఏ మేరకు సాధించారో తెలుసుకొనేందుకు ఇది అవసరమే. సాయంత్రం వరకు డ్యూటీచేసి ఇంటికొచ్చాక గంటల కొద్దీ కాల్స్ అటెండ్ చేయడమే కష్టమవుతోంది. దీంతో కుటుంబ బాధ్యతలు, బంధాలు, ప్రేమలకు దూరమవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. పిల్లలతో కలిసి కనీసం సరదాగా గడపడం లేదని బాధపడుతున్నారు. ఆఫీస్ టైమ్‌లోనే కాల్స్ ఉండాలని కోరుకుంటున్నారు. మీరూ ఈ బాధితులేనా?
Similar News
News January 19, 2025
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధాని ట్విస్ట్
కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ట్విస్ట్ ఇచ్చారు. విడుదల చేసే బందీల పేర్ల జాబితాను వెల్లడించే వరకు ఈ ఒప్పందంలో తాము ముందుకు సాగలేమని చెప్పారు. తాము ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడట్లేదని పేర్కొన్నారు. ఏం జరిగినా హమాసే బాధ్యత వహించాలని తెలిపారు. అవసరమైతే అమెరికా అండతో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు తమకు ఉందని హెచ్చరించారు.
News January 19, 2025
నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం
AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించగా 6.82 లక్షల మంది భక్తులకు టీటీడీ టోకెన్లను జారీ చేసింది. మరోవైపు రేపు దర్శనం చేసుకునే వారికి ఎలాంటి టోకెన్లు ఇవ్వబోమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. సర్వదర్శనానికి సంబంధించి నేరుగా క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలిపింది. ప్రోటోకాల్ మినహా వీఐపీ దర్శనాలను రద్దు చేసింది.
News January 19, 2025
మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడంటే?
TG: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఇది జరుగుతుందని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవడంలో వెనుకబడ్డామని హైకమాండ్ మందలించినట్లు చెప్పారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు.