News November 14, 2024
WOW: ఇది ప్రభుత్వ పాఠశాలే..!

దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలను సీఎం ఆతిశీ ఇవాళ ప్రారంభించారు. సుందరి నగర్‌లో ఈ స్కూల్‌ను సరికొత్త హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించారు. మూడంతస్తుల్లో 131 గదులు, 7 ల్యాబ్‌లు, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్, యోగా రూమ్, లిఫ్ట్, టాయిలెట్ల బ్లాక్ తదితర సౌకర్యాలతో నిర్మించారు. ఇందులో దాదాపు 7 వేల మంది విద్యార్థులు చదువుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కూల్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
Similar News
News February 20, 2026
పాపం.. దేవుడిని వదిలేయండి!

తిరుమల లడ్డూ విషయంలో పార్టీల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కొవ్వు, జంతుకొవ్వు, జస్ట్ కెమికల్ కల్తీ అంటూ రకరకాల వెర్షన్లు, రీ-వెర్షన్లతో ప్రత్యర్థులకు మరక పూసి లాభం పొందాలనే పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో స్వార్థానికై ప్రసాద పవిత్రత తగ్గిస్తున్నారని జనాలు చీదరించుకుంటున్నారు. లడ్డూను చూస్తే భక్తులకు ఆధ్యాత్మిక భావన, మదిలో ఆ దేవుడి రూపం కన్పించాలి తప్ప ఆందోళన కలగకూడదు. ఇకనైనా ఆపండి.
News February 20, 2026
కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏక సభ్య కమిషన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్‌ను నియమించింది. ఈ కమిషన్ టీటీడీలో పరిపాలనా లోపాలు, టెండర్లపై సమగ్ర పరిశీలన చేయనుంది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
News February 20, 2026
ఐటీ రైడ్‌లో సీక్రెట్ రూమ్.. రూ.కోట్ల విలువైన బంగారం!

బాలీవుడ్ సినిమా ‘రైడ్’ తరహా ఘటన రాజస్థాన్‌లో జరిగింది. కన్హా గ్రూప్‌పై రూ.100 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు 6 నగరాల్లో 3 రోజులుగా సోదాలు చేస్తున్నారు. ఇవాళ ఓ చోట సీక్రెట్ రూమ్ బయటపడింది. దాన్ని బద్దలుకొట్టి చూడగా రూ.కోట్ల విలువైన గోల్డ్ కనిపించింది. దాని విలువ ఎంత అనేది త్వరలో వెల్లడికానుంది. ఇప్పటి వరకు ₹50L నగదు, 10 బ్యాంక్ లాకర్లు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.


