News February 15, 2025
WPL: ఆర్సీబీకి కీలక ప్లేయర్ దూరం

గత సీజన్లో పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఆర్సీబీ Xలో వెల్లడించింది. ఆమె స్థానంలో స్నేహ్ రాణాను తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా నిన్న జరిగిన మ్యాచులో ఆర్సీబీ రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 18, 2025
చలికాలంలో గుండెపోటు ముప్పుకు ఈ టిప్స్‌తో చెక్!

చలితోపాటు కాలుష్యం ఎక్కువగా ఉండే తెల్లవారుజాము, అర్ధరాత్రి వేళల్లో బయటకు వెళితే గుండెపోటు ముప్పు ఎక్కువవుతుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఎక్సర్సైజులు చేసుకోవాలి. ఛాతీ, మెడ, తల కవర్ చేసేలా దుస్తులు ధరించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ముఖ్యం. పొగమంచు ఎక్కువగా పడుతుంటే మాస్క్ పెట్టుకోవాలి. గాలిలో హానికర కణాల నుంచి కాపాడుకునేందుకు ఇంట్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు వాడాలి.
News December 18, 2025
‘PPP’ తప్పనుకుంటే నన్ను జైలుకు పంపు జగన్: సత్యకుమార్

AP: PPP మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘PPPలో అభివృద్ధికి త్వరలో 4 కాలేజీలను భాగస్వాములకిస్తాం. ఇది తప్పయితే వైద్య శాఖ మంత్రినైన నన్ను జైలుకు పంపే చర్యలు తీసుకోవచ్చు’ అని సవాల్ విసిరారు. PPPని కేంద్రం, నీతి ఆయోగ్, కోర్టులు సమర్థించాయని, అందుకని PM మోదీ సహా అందరినీ జైలుకు పంపిస్తావా? అని నిప్పులు చెరిగారు.
News December 18, 2025
చలి ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్ మార్పు

TG: చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఆదిలాబాద్(D) కలెక్టర్ స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ఉన్న టైమింగ్స్‌ను ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటలకు మార్చారు. అటు ఇతర జిల్లాల్లోనూ టైమింగ్స్ మార్చాలని పేరెంట్స్ కోరుతున్నారు.


