News February 15, 2025

WPL: ఆర్సీబీకి కీలక ప్లేయర్ దూరం

image

గత సీజన్లో పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఆర్సీబీ Xలో వెల్లడించింది. ఆమె స్థానంలో స్నేహ్ రాణాను తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా నిన్న జరిగిన మ్యాచులో ఆర్సీబీ రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 28, 2025

రేపు సూర్యగ్రహణం

image

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అక్కడి కాలమానం ప్రకారం మ.2.20 గంటలకు ప్రారంభమై సా.4.17 గంటలకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. సా. 6.13 గంటలకు సూర్యగ్రహణం పూర్తవుతుంది.

News March 28, 2025

500 మంది భారతీయ ఖైదీలకు UAE క్షమాభిక్ష

image

రంజాన్ పండుగ వేళ 2813 మంది ఖైదీలకు UAE ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. మరోవైపు ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 1518 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. వీరిలో 500 మందికి పైగా భారతీయులు ఉండటం గమనార్హం. ఇది ఇండియా-UAE మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

News March 28, 2025

వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో ఉద్యోగులు ఫెయిల్!

image

ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ విషయంలో సంతృప్తిగా లేనట్లు ‘జీనియస్ కన్సల్టెంట్స్’ సర్వేలో తేలింది. పని వేళల వల్ల రెండింటినీ మేనేజ్ చేయలేకపోతున్నామని 52% మంది అభిప్రాయపడ్డారు. ప్రతి ముగ్గురిలో ఒక్కరే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. పనికి తగ్గ వేతనాలు కంపెనీ చెల్లించట్లేదని 68% మంది భావిస్తున్నారు. మెంటల్ హెల్త్, శ్రేయస్సు గురించి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తే సంతోషపడతామని 89% మంది చెప్పారు.

error: Content is protected !!