News March 12, 2025
WPL: ఆర్సీబీ విజయం.. మూడోసారి ఫైనల్లో ఢిల్లీ

WPL 2025లో చివరి లీగ్ మ్యాచులో ముంబైపై ఆర్సీబీ గెలుపొందింది. వరుస ఓటముల నడుమ ఓదార్పు విజయంతో బెంగళూరు సీజన్‌ను ముగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 199 పరుగులు చేయగా ఛేదనలో ముంబై 188 పరుగులకే పరిమితమైంది. దీంతో NRR ఆధారంగా వరుసగా మూడో సారి ఢిల్లీ ఫైనల్ చేరింది. రేపు జరిగే ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్‌తో ముంబై తలపడనుంది.
Similar News
News December 1, 2025
తగ్గుతున్న GST ఆదాయ వృద్ధి!

TG: రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం క్రమేణా తగ్గుముఖం పడుతోంది. NOVలో ₹3910 కోట్ల GST వసూలైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024 NOVలో వచ్చిన ₹3880 కోట్ల ఆదాయంతో పోలిస్తే దాదాపు 1% పెరిగింది. అయితే అయితే ఇటీవల గణాంకాలను పరిశీలిస్తే నెలనెలా పెరగాల్సిన ఆదాయం తగ్గుముఖం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. GST-2.O అమలు చేసినప్పటి తరువాత నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోందని వారు చెబుతున్నారు.
News December 1, 2025
ఎయిర్‌పోర్టుల్లో GPS స్పూఫింగ్ జరిగింది: కేంద్రం

ఇటీవల ఢిల్లీలో విమాన సర్వీసుల రద్దుకు GPS స్పూఫింగ్ కారణమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. HYD, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, అమృత్సర్, చెన్నైలకూ ఫేక్ సిగ్నల్స్ వచ్చాయన్నారు. శాటిలైట్ నావిగేషన్‌లో ఇలా జరగడంతో వెంటనే గ్రౌండ్ నావిగేషన్, సర్వైలెన్స్ యాక్టివేట్ చేశామని MP నిరంజన్ రెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో ఇవాళ సమాధానం ఇచ్చారు. ఈ సిగ్నల్స్ సోర్స్ గుర్తించే పనిలో కేంద్రం ఉందన్నారు.
News December 1, 2025
కాంగ్రెస్‌కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

కాంగ్రెస్‌కు ఆ పార్టీ MP శశిథరూర్‌కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్‌కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్‌కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్‌లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.


