News March 12, 2025

WPL: ఆర్సీబీ విజయం.. మూడోసారి ఫైనల్లో ఢిల్లీ

image

WPL 2025లో చివరి లీగ్ మ్యాచులో ముంబైపై ఆర్సీబీ గెలుపొందింది. వరుస ఓటముల నడుమ ఓదార్పు విజయంతో బెంగళూరు సీజన్‌ను ముగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 199 పరుగులు చేయగా ఛేదనలో ముంబై 188 పరుగులకే పరిమితమైంది. దీంతో NRR ఆధారంగా వరుసగా మూడో సారి ఢిల్లీ ఫైనల్ చేరింది. రేపు జరిగే ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్‌తో ముంబై తలపడనుంది.

Similar News

News February 16, 2026

ఏటి ఈతకు లంక మేతకు సరి

image

ఒక పశువు నదిని (ఏరు) ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న లంక భూమికి వెళ్తుంది. అక్కడ కడుపు నిండా మేత మేస్తుంది. కానీ తిరిగి ఇంటికి రావాలంటే మళ్ళీ అదే నదిని ఈదుకుంటూ రావాలి. ఆ ఈతలో పడే కష్టం వల్ల మేసిన మేత అంతా అరిగిపోతుంది. అంటే, ఆ పశువుకు మేత వల్ల వచ్చిన శక్తి, నదిని ఈదడానికే ఖర్చయిపోతుంది. ఎవరైనా ఒక పనిలో ఎంత సంపాదిస్తున్నారో అదంతా ఆ పని చేయడానికే ఖర్చయిపోతే లాభంలేదని చెప్పడానికి ఈ సామెత వాడతారు.

News February 16, 2026

విరమణ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి?

image

రోజంతా ఉపవాసం ఉన్నందున, విరమణ సమయంలో ఒకేసారి భారీ ఆహారం తీసుకోకూడదు. ముందుగా మంచినీరు, పండ్ల రసంతో కడుపుని తేలికపరచాలి. ఆ తర్వాత సాత్విక ఆహారమైన అన్నం, పప్పులు వంటి సులభంగా అరిగే పదార్థాలను తీసుకోవాలి. కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా కాపాడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఈరోజు మాంసాహారం అస్సలు తినకూడదని పండితుల సూచన.

News February 16, 2026

శివరాత్రి జాగరణ.. ఇవాళ ఏం చేయాలంటే?

image

శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండి జాగరణ చేసిన భక్తులు ఇవాళ ఉదయం శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలని చెబుతున్నారు. నిన్న ఉపవాసం, జాగరణ చేసిన వారంతా ఇవాళ రాత్రి అయ్యే వరకూ నిద్రపోకూడదని, అలా చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుందని అంటున్నారు.