News February 15, 2025
WPL: ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ 164 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ బ్యాటర్ స్కివర్ బ్రంట్(80*) అదరగొట్టగా కెప్టెన్ హర్మన్ ప్రీత్(42) ఫర్వాలేదనిపించారు. యస్తికా(11) మినహా ఇతర ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్నాబెల్ 3, శిఖా పాండే 2, కాప్సే, మిన్నూ చెరో వికెట్ వికెట్ తీశారు. DELHI టార్గెట్ 165.
Similar News
News March 28, 2025
IPL: ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయాయ్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలై 18 ఏళ్లు పూర్తవుతోంది. అయితే, ఈ టోర్నీలో కొన్ని టీమ్స్ మెరుపులా వచ్చి అభిమానుల ప్రేమను సొంతం చేసుకొని పలు కారణాలతో రద్దయ్యాయి. అవేంటో తెలుసుకుందాం. డెక్కన్ ఛార్జర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, గుజరాత్ లయన్స్, పుణే వారియర్స్ ఇండియా, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లు కొన్ని సీజన్లకే పరిమితం అయ్యాయి. ఇందులో ఏ టీమ్‌కు మీరు సపోర్ట్ చేసేవారు? COMMENT
News March 28, 2025
భార్యను చంపి.. సూట్‌కేసులో కుక్కి..

బెంగళూరులో ఘోరం జరిగింది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య(32)ను హత్య చేశాడు. అనంతరం సూట్‌కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు. తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ చేయిచేసుకుంటోందన్న కోపంతోనే భర్త ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
News March 28, 2025
నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేడు చెన్నై వెళ్లనున్నారు. మద్రాస్ ఐఐటీలో జరగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఏఐ, ఐఓటీ వంటి పలు అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. తిరిగి సాయంత్రం సీఎం అమరావతికి చేరుకుంటారు.