News January 5, 2025

WTC ఫైనల్ ఆశలు గల్లంతు.. IND ఇంటిముఖం

image

BGT సిరీస్ కోల్పోవడంతో భారత్ WTC ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి టెస్టులో ఘోర ఓటమితో ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న భారత్ ఇంటిముఖం పట్టింది. మొదటి టెస్ట్ గెలుపుతో మరోసారి ఫైనల్ చేరి టెస్ట్ గద సొంతం చేసుకుంటుదని భావించారంతా. ఆ తర్వాత టాప్‌ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం, బుమ్రా మినహా బౌలర్లు రాణించకపోవడంతో భారత్‌ సిరీస్ కోల్పోయింది. అటు, WTC ఫైన‌ల్ చేరిన ఆసీస్ లార్డ్స్‌లో సౌతాఫ్రికాతో జూన్ 11న తలపడనుంది.

Similar News

News April 17, 2026

ఇచ్చేయండి సార్.. షరీఫ్‌కు నోబెల్ ఇవ్వాలంటూ పాక్‌లో తీర్మానం!

image

‘నోబెల్’ విషయంలో ట్రంప్‌కు పాక్ పోటీ ఇస్తోంది. తమ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌కు పీస్ ప్రైజ్ ఇవ్వాలన్న మీడియా <<19605334>>ప్రచారానికి<<>> పంజాబ్ అసెంబ్లీ వంతపాడింది. యుద్ధం ఆపేందుకు చేసిన ప్రయత్నాలకు వారికి ఇవ్వాల్సిందేనని తీర్మానం చేసింది. పాక్‌లో జరిగిన చర్చలు ఫలించలేదు. కానీ ట్రంప్ తాను <<19668983>>10వ వార్<<>> ఆపబోతున్నానని మళ్లీ నోబెల్ రేసులోకొచ్చారు. మరి పాక్ కథ ట్రంప్ చెవిన పడిందో లేదో!

News April 17, 2026

సౌందర్య.. అచ్చ తెలుగు ఆడపడుచులా!

image

టాలీవుడ్‌లో మహానటి సావిత్రి తర్వాత అంతటి అభిమానం పొందిన హీరోయిన్లలో సౌందర్య ఒకరు. ‘మనవరాలి పెళ్లి’తో 1993లో తెలుగు సినిమాల్లోకి వచ్చి పదేళ్లు సినీరంగాన్ని ఏలారు. 100కుపైగా మూవీస్‌లో నటించారు. అసభ్య వస్త్రధారణకు దూరంగా నిండైన చీరకట్టుతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. నేడు సౌందర్య వర్ధంతి.

News April 17, 2026

ఇండియాకు వాంటెడ్ టెర్రరిస్టులు.. పాక్‌లో హతం!

image

లష్కరే తోయిబా(LeT) కో ఫౌండర్ అమీర్ హమ్జాపై పాక్‌లో <<19664047>>కాల్పులు<<>> జరగడం తెలిసిందే. మూడేళ్లుగా LeT, జైషే(JeM), హిజ్బుల్(HM)లోని వాంటెడ్ టెర్రరిస్టులు ‘గుర్తుతెలియని వ్యక్తుల’ కాల్పుల్లో హతమవుతున్నారు. మహ్మద్ తాహిర్ అన్వర్(JeM చీఫ్ మసూద్ అజర్ అన్న), LeT టెర్రరిస్టు అబు ఖతల్(హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు), ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్‌వార్‌తో సహా ఎంతో మందిని పాక్‌లో మట్టుబెట్టారు.