News February 16, 2025
ఈ నెల 19 నుంచి యాదగిరి గుట్ట స్వర్ణగోపుర సంప్రోక్షణ

TG: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 19న మొదలుకానున్నాయి. 23 వరకూ ఆ కార్యక్రమాలను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. 23న మహాకుంభాభిషేక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. తాపడం పనులు ఈ నెల 19కి పూర్తికానున్నాయి. దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణగోపురంగా నిలవనున్న విమాన గోపురానికి 60కిలోలకు పైగా బంగారాన్ని వినియోగించడం విశేషం.
Similar News
News March 23, 2025
గుడ్‌న్యూస్: 100శాతం రాయితీతో రూ.50,000

TG: రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా చిరువ్యాపారాలు చేసే ఈబీసీలకు ప్రభుత్వం 100% రాయితీతో రూ.50వేల రుణం అందిస్తోంది. రూ.లక్షలోపు రుణాలకు 90% రాయితీ ఇవ్వనుంది. ఓ లబ్ధిదారుడు రూ.లక్ష తీసుకుంటే కేవలం రూ.10వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక రూ.లక్ష నుంచి రూ.2లక్షల్లోపు రుణాలకు 80శాతం, రూ.2-4లక్షల్లోపు రుణాలకు 70శాతం రాయితీ ఇవ్వనుంది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
వెబ్‌సైట్:<
News March 23, 2025
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22లోగా సమాధానం ఇవ్వాలని తొలుత ఆయనకు ఆదేశాలు ఇవ్వగా స్పందించలేదు. దీంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను BRS కోరినా ఫలితం లేకపోవడంతో ఆ పార్టీ SCని ఆశ్రయించింది. ఈనెల 25న ఈ కేసును ధర్మాసనం విచారించనుంది.
News March 23, 2025
తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు?

తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులు గాజు సీసాలను విక్రయిస్తున్నారు. భక్తులు ఆ సీసాలను వాడాక విసిరేస్తుండటంతో అవి ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇక ఇటీవల కొంతమంది ఒకరిపై ఒకరు గాజు సీసాలతోనే దాడులు చేసుకోవడంతో TTD అప్రమత్తమైంది. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ సీసాలు, ప్యాకెట్లను వాడటంపై దృష్టి సారించింది. త్వరలోనే ఈ విషయంలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.