News September 20, 2024
దిగ్గజాల సరసన యశస్వీ జైస్వాల్
భారత క్రికెటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించారు. తొలి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ 10 టెస్టుల్లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్క్ టేలర్(1,088)ను అధిగమించారు. ఈ జాబితాలో బ్రాడ్‌మన్(1,446) అగ్ర స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఎవర్టన్ వీక్స్(1,125), జార్జ్ హెడ్లీ(1,102) కొనసాగుతున్నారు.
Similar News
News October 7, 2024
టీటీడీపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఈవో
AP: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)పై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈవో శ్యామలరావు హెచ్చరించారు. టీటీడీని తక్కువ చేసేలా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవన్నారు. ఇటీవల అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందంటూ ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తిరుమల పోలీసులు తెలిపారు.
News October 7, 2024
మద్యం దుకాణాల్లో ఎమ్మెల్యేల దందా.. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి?
AP: మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియలో ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. దరఖాస్తులు వేయొద్దని, తమకు వాటాలు ఇవ్వాలని వ్యాపారులను డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 3,396 దుకాణాలకు లక్ష దరఖాస్తులు, రుసుముల రూపంలో రూ.2వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటికి 8,274 మాత్రమే వచ్చాయి. 961 షాపులకు ఒక్క దరఖాస్తూ రాలేదు. దరఖాస్తుల స్వీకరణ గడువు 3 రోజుల్లో ముగియనుంది.
News October 7, 2024
HYDRA కూల్చివేతలతో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు!
TG: నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు, ఆస్తుల కొనుగోళ్లపై పడింది. ఒక్క Septలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం 30% తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది Septలో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి ₹955కోట్ల రాబడి రాగా ఈ సెప్టెంబర్‌లో లావాదేవీలు 80వేలకు పడిపోయి రాబడి సైతం ₹650కోట్లకే పరిమితమైంది. HYD, పరిసర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువుంది.