News November 24, 2024
బిగ్‌బాస్ నుంచి యష్మీ ఎలిమినేట్?

బిగ్‌బాస్ సీజన్-8 చివరి దశకు చేరింది. దీంతో టాప్-5లో ఎవరు నిలుస్తారు? విజేత ఎవరవుతారనే ఆసక్తి పెరుగుతోంది. ఈవారం నామినేషన్స్‌లో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ, నబీల్ ఉన్నారు. అయితే నిఖిల్, ప్రేరణ, నబీల్ సేవ్ కాగా యష్మీ, పృథ్వీ చివరి రెండు స్థానాల్లో నిలిచారు. వీరిద్దరిలో యష్మీ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూట్ నిన్నే పూర్తి కాగా ఇవాళ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.
Similar News
News February 9, 2026
BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,240 పెరిగి రూ.1,58,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,050 ఎగసి రూ.1,45,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది.
News February 9, 2026
బలమైన బంధం కోసం రోజూ శృంగారం: సైంటిస్టులు

బలమైన సంబంధాల కోసం భార్యాభర్తలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. భాగస్వాములు సన్నిహితంగా ఉన్న రోజుల్లో వారిలో ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. కానీ ఇది 24 గంటల వరకేనని సూచిస్తున్నారు. అయితే రిలేషన్‌లో సమస్యలను తగ్గించుకునేందుకు జరిపే శృంగారం వల్ల తర్వాతి రోజు ఒత్తిడి పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. 319 జంటలపై చేసిన ఈ స్టడీ Archives of Sexual Behaviorలో ప్రచురితమైంది.
News February 9, 2026
గోత్రాలు ఎలా ఏర్పడతాయో తెలుసా?

గోత్రం అంటే మూల పురుషుడి నుంచి ఉద్భవించిన వంశం అని అర్థం. సంస్కృతంలో ‘గో’ అంటే వేదం, భూమి, ఆవు అనే అర్థాలున్నాయి. పూర్వం వశిష్ట, భరద్వాజ వంటి సప్తర్షుల పేర్ల మీద ఈ గోత్రాలు ఏర్పడ్డాయి. తమ వంశం ఏ గురువు లేదా మహర్షి ఆధ్యాత్మిక పరంపర నుంచి వచ్చిందో ఇది తెలియజేస్తుంది. కాలక్రమేణా ప్రముఖ వ్యక్తులు, పూర్వీకుల పేర్లతో కూడా గోత్రాలు వెలిశాయి. ఇది మన మూలాలను, వంశ గౌరవాన్ని గుర్తుచేసే ఓ పవిత్ర గుర్తింపు.


