News August 6, 2024
ఎల్లుండి నుంచే యశ్ ‘టాక్సిక్’ షూటింగ్!
‘కేజీఎఫ్-2’ తర్వాత యశ్ నటించిన సినిమాల కోసం ఎదురుచూస్తోన్న అభిమానులకు గుడ్ న్యూస్. రాకింగ్ స్టార్ యశ్ నటించబోయే ‘Toxic’ సినిమా షూటింగ్ ఈనెల 8వ తేదీన ప్రారంభం అవుతుందని సినీవర్గాలు తెలిపాయి. యశ్‌కు ‘8’ నంబర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన పుట్టిన తేదీ కూడా ఎనిమిదే. అందుకే 8వ నెలలో 8వ తేదీన షూటింగ్ ప్రారంభించేందుకు ఆయన మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Similar News
News September 15, 2024
19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్?
AP: ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్‌లో కొత్త మద్యం పాలసీపై చర్చించి 19న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. OCT 1 నుంచి పాలసీని అమలు చేయాలని యోచిస్తోంది. ఆన్‌లైన్ లాటరీ ద్వారా షాపుల లైసెన్సులు జారీ చేయనుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ పరిధిలో షాపులు ఉండగా, ఇకపై ప్రైవేటు వ్యక్తులకే అప్పగించే అవకాశం ఉంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని CM, మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.
News September 15, 2024
IPLలో కలిసి ఆడి టెస్టులో స్లెడ్జింగ్.. షాకయ్యా: ధ్రువ్ జురెల్
IPLలో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో కలిసి ఆడిన జో రూట్ టెస్టు మ్యాచ్‌లో స్లెడ్జింగ్ చేయడంతో షాకయ్యానని ధ్రువ్ జురెల్ చెప్పారు. ఈ ఏడాది రాజ్‌కోట్ వేదికగా ENGతో జరిగిన టెస్టులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అతను గుర్తు చేసుకున్నారు. ‘రూట్ అదేపనిగా నన్ను స్లెడ్జింగ్ చేశారు. అతని మాటలు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే మనం ఇప్పుడు దేశం కోసం ఆడుతున్నామని అతను చెప్పారు’ అని పేర్కొన్నారు.
News September 15, 2024
‘మత్తు వదలరా-2’ చూసి చాలా ఎంజాయ్ చేశాం: మహేశ్ బాబు
మత్తు వదలరా-2 మూవీ యూనిట్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. ‘సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాం. సింహా, ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. వెన్నెల కిశోర్ స్క్రీన్‌పై కనిపించగానే నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. సత్యను చూస్తున్నంతసేపూ మేమంతా నవ్వుతూనే ఉన్నాం. మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్’ అని ట్వీట్ చేశారు.