News November 11, 2024

బీఏసీ సమావేశానికి YCP గైర్హాజరు

image

AP: స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ గైర్హాజరైంది. ఈ ఉదయం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. రూ.2.94లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం సమావేశాలను ఎల్లుండికి వాయిదా వేశారు.

Similar News

News December 7, 2024

మ్యూజిక్ నుంచి రెహమాన్ బ్రేక్? కూతురు ఏమన్నారంటే?

image

ఏఆర్ రెహమాన్ ఏడాదిపాటు మ్యూజిక్ వర్క్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కూతురు ఖతీజా ఖండించారు. ఇలాంటి పనికిరాని రూమర్స్‌ను ప్రచారం చేయొద్దని మండిపడ్డారు. ఇటీవల రెహమాన్, తన భార్య సైరా భాను విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాతో పాటు పలు ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు.

News December 7, 2024

అల్పపీడనం.. రేపు వర్షాలు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.

News December 7, 2024

రైతులు సన్నాలనే పండించాలి.. సీఎం పిలుపు

image

TG: తెలంగాణ రైతులు సన్న వడ్లనే పండించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సన్నవడ్లు పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. రేషన్ కార్డుదారులకు, మధ్యాహ్నభోజనంలో పేద పిల్లలకు రైతులు పండించిన సన్నబియ్యాన్నే పెడతామని పేర్కొన్నారు. ఎవరు అడ్డువచ్చినా సంక్రాంతి తర్వాత రైతుభరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.