News November 22, 2024
PAC ఎన్నికను బాయ్కాట్ చేసిన YCP
AP: PAC ఛైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ప్రతిపక్షానికే కేటాయిస్తున్నారని, అందుకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహిస్తున్నారని YCP నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే PAC ఎన్నికను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పుడూ అధికార పక్షం ఈ పదవిని తీసుకోలేదని, అవినీతి జరగకుండా పీఏసీ వాచ్డాగ్ లా పని చేస్తుందన్నారు. అధికార పక్షం ఆ ఛైర్మన్ పదవి తీసుకుంటే ఏం న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
Similar News
News November 22, 2024
చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోము: రంగనాథ్
TG: చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోమని, చెరువులను కాపాడాలంటే నివాసాలను కూల్చాల్సిన పనిలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. నిర్మాణాలు కూల్చి చెరువులను కాపాడటం హైడ్రా ఉద్దేశం కాదని, చెరువుల పరిధిలో కొత్త నిర్మాణాలను అడ్డుకోవడం లక్ష్యమన్నారు. కొంతమందిపై చర్యలతో హైడ్రా పని అందరికీ తెలిసిందని, FTL, బఫర్ జోన్లపై అవగాహన వస్తోందని చెప్పారు. ఆక్రమణల నియంత్రణకు సాంకేతికత వాడుతున్నామన్నారు.
News November 22, 2024
దేశంలో టెలికం యూజర్ల సంఖ్య ఇలా!
టెలికం రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. BSNL తీసుకున్న కొన్ని నిర్ణయాలు జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా మారాయి. గత కొన్ని నెలలుగా సంస్థకు భారీగా వినియోగదారులు పెరిగారు. సెప్టెంబర్ 30 వరకు టెలికం మార్కెట్లో ఉన్న కంపెనీల షేర్స్ ఇలా ఉన్నాయి. Jio యూజర్లు 47.7 కోట్లు, Airtel యూజర్లు 28.5 కోట్లు, Vodaphone Idea యూజర్లు 12.26 కోట్లు, BSNL యూజర్లు 3.7 కోట్లు.
News November 22, 2024
రెచ్చిపోతున్న హిజ్రాలు!
HYDలో హిజ్రాల దోపిడీ మితిమీరుతోందని, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, షాప్ ఓపెనింగ్స్.. ఇలా శుభకార్యమేదైనా వేలకు వేలు దండుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇళ్లల్లో రూ.30వేలు తీసుకున్నారని ఓ నెటిజన్ వాపోయారు. ఎక్కడ ఫంక్షన్ జరిగినా వాళ్లకెలా తెలుస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. మరి మీకూ హిజ్రాలతో ఇలాంటి అనుభవం ఎదురైందా?