News November 22, 2024
PAC ఎన్నికను బాయ్‌కాట్ చేసిన YCP

AP: PAC ఛైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ప్రతిపక్షానికే కేటాయిస్తున్నారని, అందుకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహిస్తున్నారని YCP నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే PAC ఎన్నికను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పుడూ అధికార పక్షం ఈ పదవిని తీసుకోలేదని, అవినీతి జరగకుండా పీఏసీ వాచ్‌డాగ్ లా పని చేస్తుందన్నారు. అధికార పక్షం ఆ ఛైర్మన్ పదవి తీసుకుంటే ఏం న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
Similar News
News July 11, 2025
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: ఉత్తమ్

TG: సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. దాదాపు 5 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని చెప్పారు. కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల రేషన్ కార్డులిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.13వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు.
News July 11, 2025
ఒక్క MLA అయినా రైతులను పరామర్శించాడా?: పేర్ని నాని

AP: చంద్రబాబు ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. మామిడి కొనుగోళ్లపై మంత్రులు అధికారులు తలో మాట చెబుతున్నారని ఆరోపించారు. ‘మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఒక్క ఎమ్మెల్యే అయినా వారిని పరామర్శించారా? రైతులను పరామర్శించడానికి జగన్ వెళ్తుంటే అడ్డుకుంటారా? కొంతమందికి కూలీ ఇచ్చి మరీ జగన్‌ను తిట్టిస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News July 11, 2025
బీసీలతో కవితకు ఏం సంబంధం?: మహేశ్ గౌడ్

TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తమ <<17024394>>విజయమని <<>>BRS MLC కవిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందించారు. ‘బీసీ రిజర్వేషన్లతో కవితకు ఏం సంబంధం? మేం చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటి? ఆమెను చూసి జనం నవ్వుకుంటున్నారు. గత పదేళ్లు కేసీఆర్ ఏం వెలగబెట్టారని కవిత బీసీ పాట పాడుతున్నారు? ఇది రాహుల్ ఎజెండా, రేవంత్ నిబద్ధత’ అని ఆయన స్పష్టం చేశారు.