News February 22, 2025
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం

AP: ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం తీసుకుంది. వరుసగా 60రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ఆస్కారం ఉంది. దీంతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సాధారణ MLAగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ గత సమావేశాలకు హాజరుకాని విషయం తెలిసిందే.
Similar News
News November 25, 2025
HYD: మున్సిపాలిటీలపై ‘ముప్పేట దాడి’

ORR పరిసరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న అభివృద్ధిని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం, ఏకంగా 27 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయాలని ప్రతిపాదించడంతో శివారులో సెగ రగులుతోంది. సమగ్ర ప్రణాళిక పేరుతో చేసే ఈ విలీనం, సేవలకు మేలో లేదో తెలియదు గానీ, ప్రజలకు పన్నులు, ఫీజుల భారం తప్పేలా లేదు. ఆదరాబాదరాగా తీసుకున్న ఈ నిర్ణయంపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వం GHMCని ఆదేశించింది. ఇది ప్రజలకు వరమా, శాపమా మీ కామెంట్.

ఇమ్యునిటీ తగ్గిందని తెలిపే లక్షణాలివే..

రోగనిరోధకశక్తి తగ్గితే తరచూ రోగాల బారిన పడతాం. అయితే ఇమ్యునిటీ తగ్గిందని కొన్ని లక్షణాలతో తెలుస్తుంది. తరచూ అనారోగ్యం బారిన పడటం, జీర్ణ సమస్యలు, గాయాలు మానడం ఆలస్యం కావడం, అధిక ఒత్తిడి వంటివి లో ఇమ్యునిటీ లక్షణాలు. సిట్రస్ ఫ్రూట్స్, చేపలు, రొయ్యలు, చికెన్, మటన్, పప్పులు, గుమ్మడి, అవిసె, చియా విత్తనాలు, నువ్వులు, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ తింటే ఇమ్యునిటీ పెరుగుతుంది.