News November 8, 2024
ఆ రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైసీపీ

AP: చిలకలూరిపేట, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ సమన్వయకర్తలను ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజకవర్గానికి విడదల రజిని, తాడికొండకు వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)ను నియమించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.
Similar News
News December 6, 2025
విమానానికి బాంబు బెదిరింపు.. తీవ్ర కలకలం

TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఫ్లైట్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్‌ను ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైట్‌లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
News December 5, 2025
పవనన్నకు థాంక్స్: లోకేశ్

AP: చిలకలూరిపేట ZPHSలో నిర్వహించిన మెగా PTM 3.Oకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌కు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘హైస్కూలు లైబ్రరీకి పుస్తకాలు, ర్యాక్‌లు, 25 కంప్యూటర్లు అందిస్తామని ప్రకటించిన పవనన్నకు ధన్యవాదాలు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా మన విద్యావ్యవస్థను 2029 నాటికి దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు Dy.CM అందిస్తున్న సహకారం చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు.
News December 5, 2025
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.


