News November 8, 2024

ఆ రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైసీపీ

image

AP: చిలకలూరిపేట, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ సమన్వయకర్తలను ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజకవర్గానికి విడదల రజిని, తాడికొండకు వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)ను నియమించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

Similar News

News December 8, 2024

భారత్ ఘోర పరాజయం

image

అడిలైడ్ డే నైట్ టెస్టులో భారత్ ఘోర పరాజయంపాలైంది. ఇండియా తొలి ఇన్నింగ్స్ 180కి ఆలౌట్ కాగా ఆస్ట్రేలియా 337 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు చాప చుట్టేసింది. నితీశ్ కుమార్ రెడ్డి(42) ఒక్కరే పోరాడారు. 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సునాయాసంగా టార్గెట్‌ను ఛేదించింది. దీంతో 5 టెస్టుల BGTలో ఇరు జట్లూ 1-1 స్కోర్‌లైన్‌తో సమానమయ్యాయి.

News December 8, 2024

త్రిపురలో 10మంది బంగ్లాదేశీ హిందువుల అరెస్ట్

image

చట్ట విరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించిన 10మంది బంగ్లాదేశీ హిందువుల్ని త్రిపురలో పోలీసులు అరెస్ట్ చేశారు. అంబాసా రైల్వే స్టేషన్లో వారందర్నీ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా.. తమది కిషోర్‌గంజ్ జిల్లాలోని ధన్‌పూర్ గ్రామమని, అక్కడ దాడుల్ని భరించలేక ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని భారత్‌లోకి వచ్చామని పట్టుబడ్డవారు తెలిపారు. బంగ్లాలో పరిస్థితి బాలేదని, తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

News December 8, 2024

టెస్ట్ క్రికెట్‌లో ఇంట్రస్టింగ్ ఫైట్!

image

ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ చూస్తుంటే ‘పొట్టోణ్ని పొడుగోడు కొడితే పొడుగోణ్ని పోచమ్మ కొట్టిందంట’ అన్న నానుడి గుర్తొస్తోంది. గత 2 నెలల్లో ఒక జట్టుపై సిరీస్ గెలిచిన టీమ్ మరో జట్టు చేతిలో వైట్ వాష్‌కు గురవుతోంది. OCTలో NZపై SL(2-0), NOVలో INDపై NZ(3-0), ఇప్పుడు NZపై ENG (2-0) సిరీస్ గెలిచాయి. SL కూడా ప్రస్తుతం SAతో సిరీస్‌లో వైట్ వాష్‌ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.