News March 25, 2025
రేపు వైసీపీ ఇఫ్తార్ విందు

AP: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రేపు సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వైసీపీ వెల్లడించింది. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొంది.
Similar News
News April 19, 2025
గద్వాల్: భూభారతితో రైతులకు భద్రత: పొంగులేటి

భూభారతి 2025 చట్టం రైతులకు మరింత భద్రత కల్పిస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గద్వాల్ జిల్లా ధరూర్ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో భూభారతి చట్టంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి హాజరై, మాట్లాడారు. గతంలో ధరణి వల్ల రైతులు ఇబ్బంది పడ్డారని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చిందన్నారు. రైతు సమస్యలు తొలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
News April 19, 2025
ఒకే రోజు ఓటీటీ, టీవీల్లోకి కొత్త సినిమా?

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ ZEE5లో మే 2 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజున జీ తెలుగు ఛానల్లోనూ రానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. వార్నర్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఒకే రోజున OTT, టీవీల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
News April 19, 2025
ఔరంగజేబు క్రూరుడని నెహ్రూయే అన్నారు: రాజ్‌నాథ్ సింగ్

మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ వంటివాళ్లు దేశానికి ఆదర్శం కానీ ఔరంగజేబులాంటివారు కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘శౌర్యానికి, దేశభక్తికి మహారాణా ప్రతాప్ ఓ ప్రతీక. ఆయన్నుంచి స్ఫూర్తి పొంది శివాజీ మొఘలులపై పోరాడారు. ఔరంగజేబు పరమ క్రూరుడని నెహ్రూయే స్వయంగా అన్నారన్న విషయం అందరూ తెలుసుకోవాలి. రాణా, శివాజీ ఇద్దరూ మొఘలులకు మాత్రమే వ్యతిరేకం. ముస్లింలకు కాదు’ అని పేర్కొన్నారు.