News April 10, 2024
వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు

AP: రానున్న ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తణుకు ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన.. ‘రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది. ప్రజాగళానికి వారాహి తోడైంది. సైకిల్ స్పీడ్‌కి, గ్లాసు జోరుకు తిరుగులేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాయి. జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. చీకటి పాలనను అంతం చేయడానికి ఓటు చీలకూడదు’ అని ఆకాంక్షించారు.
Similar News
News March 27, 2025
పెరగనున్న మెడిసిన్స్ ధరలు

ఔషధాల ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డ్రగ్స్ కంట్రోల్ సిద్ధమవుతోంది. దేశంలో అత్యధిక మంది వాడే షుగర్ మాత్రలతో పాటు క్యాన్సర్, గుండె సమస్యలు తదితర మెడిసిన్స్ రేట్లు ప్రియం కానున్నాయి. వీటి ధరలు 1.7శాతం పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ తెలిపారు. మరో 2,3 నెలల్లో కొత్త రేట్లు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.
News March 27, 2025
షాకింగ్: అరణ్యంలో చిన్నారి మావోయిస్టులు!

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో బాల మావోయిస్టులను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన సారయ్య వద్ద లభ్యమైన లేఖలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. గెరిల్లా యుద్ధం కోసం 130 మంది బాల బాలికలను రిక్రూట్ చేసుకున్నారు. 9 నుంచి 11 ఏళ్ల చిన్నారులు 40 మంది, 14 నుంచి 17 ఏళ్లలోపు వారు 40 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వీరికి స్నైపర్ గన్స్, IED, ఫైటింగ్, అటాకింగ్ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నారు.
News March 27, 2025
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఢిల్లీ ప్రభుత్వం మందుల సేకరణ విధానంపై సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి ఆస్పత్రులు ఇకపై పీఎం జన ఔషధి కేంద్రాల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఇది అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వర్తిస్తుందని తెలిపింది. మెడిసిన్స్ కొనుగోలును మరింత పారదర్శకంగా మార్చేందుకు, తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఢిల్లీ సర్కారు MoU కూడా కుదుర్చుకుంది.