News January 27, 2025
కొత్త క్యాంపెయిన్ ప్రారంభించిన వైసీపీ

AP: అధికార మదంతో కూటమి నేతలు ఊరురా దాడులు, దౌర్జన్యానికి పాల్పడుతూ అక్రమాలు చేస్తున్నారని వైసీపీ మండిపడింది. బాధితులకు అండగా ఉంటామంటూ కొత్త క్యాంపెయిన్ షురూ చేసింది. ‘మీ ఊరిలో కూటమి నేతలు అరాచకాలు చేస్తే ఫొటోలు, వీడియోలు తీసి #KutamiFiles #ConstituencyName ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి’ అని పిలుపునిచ్చింది. బాధితుల తరఫున వైసీపీ పోరాటం చేస్తుందని పేర్కొంది.
Similar News
News February 14, 2025
రేపు కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన

AP: ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’లో భాగంగా CM చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11.45కు ఆయన కందుకూరు TRR కాలేజీలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12.05కు దూబగుంట శివారులోని వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మార్కెట్ యార్డుకు చేరుకొని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.
News February 14, 2025
MLC ఎలక్షన్స్: బరిలో 90 మంది

TG: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్స్ స్థానానికి 15, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీలో ఉన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది.
News February 14, 2025
భారత్‌ది ఎప్పుడూ ‘శాంతి’ పక్షమే: మోదీ

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. కానీ భారత్ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని చెప్పారు. పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనలాగే ట్రంప్‌కు కూడా దేశమే తొలి ప్రాధాన్యమని, ఇరుదేశాలు మరింత బలోపేతమై ఇంకా ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ అని పేర్కొన్నారు.