News November 23, 2024
4 తుపాకులతో పట్టుబడిన వైసీపీ నేత
AP: కర్నూలు జిల్లాకు చెందిన YCP నేత, మాజీ మావోయిస్టు వట్టి వెంకటరెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా సున్నిపెంటకు చెందిన వెంకటరెడ్డి బిహార్ నుంచి 4 రివాల్వర్లు, 8 మ్యాగజైన్లు, 18 రౌండ్ల బుల్లెట్లు తీసుకొస్తూ ఆదిలాబాద్ పోలీసులకు చిక్కారు. అతడిపై ఇప్పటికే 10 కేసులకుపైగా ఉన్నాయి. కాగా కర్నూలు జిల్లాలో జనశక్తి పార్టీని పునర్నిర్మించేందుకే ఆయన వీటిని తీసుకొస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 4, 2024
ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన టీమ్ ఇండియా
అడిలైడ్ టెస్టుకు ముందు టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్లకు 5వేలమందికి పైగా ఫ్యాన్స్ హాజరయ్యారు. భారత క్రికెటర్లను వారిలో పలువురు అసభ్యంగా దూషించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రోహిత్, పంత్ బరువుపై ట్రోల్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో భారత ప్రాక్టీస్ సెషన్లకు ఇకపై అభిమానుల్ని అనుమతించేది లేదని బీసీసీఐ ప్రకటించింది. కాగా.. ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్‌కు 50మంది మాత్రమే రావడం గమనార్హం.
News December 4, 2024
కీర్తి సురేశ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వెడ్డింగ్ కార్డ్ వైరల్
మహానటి కీర్తి సురేశ్, తన ప్రియుడు అంథోనీని పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న వీరి పెళ్లి అని ఓ వెడ్డింగ్ కార్డ్ వైరలవుతోంది. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరుగుతుందని సమాచారం. ఇటీవల కీర్తి తన కుటుంబసభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
News December 4, 2024
బాలయ్య కొత్త గెటప్ చూశారా?
పాత్ర ఏదైనా తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. అన్‌స్టాపబుల్ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాలయ్య వ్యోమగామి లుక్‌లో కనిపించారు. దీంతో ఆదిత్య 369 సీక్వెల్‌కి బాలయ్య హింట్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు గతంలో బాలయ్యకు ఈ మూవీ సీక్వెల్‌ను తన కుమారుడు మోక్షజ్ఞతో తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా గెటప్ చర్చనీయాంశంగా మారింది.