News September 8, 2025
YCP ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: అయ్యన్న

AP: ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు తగిన సమయం ఇస్తామన్నారు. అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘యూరియాపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. యూరియాపైనే కాదు మిగతా అన్ని సమస్యలపైనా చర్చిద్దాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.
Similar News
News September 9, 2025
రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన CP రాధాకృష్ణన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రజాజీవితంలో మీ దశాబ్దాల అనుభవం దేశ ప్రగతికి ఎంతో దోహదపడనుంది. మీ బాధ్యతల్లో విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నా’ అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘పేదల ఉన్నతికి, సమాజ సేవకు జీవితం అంకితం చేశారు. ఉత్తమ VPగా నిలుస్తారన్న నమ్మకం నాకు ఉంది’ అని PM మోదీ పేర్కొన్నారు. అమిత్‌షా, CBN, పవన్, లోకేశ్, జగన్ ఆయనకు విషెస్ తెలిపారు.
News September 9, 2025
ALERT: ఇక ఎగ్జామ్ పేపర్స్ షేర్ చేస్తే జైలుకే!

అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. SM, ఆన్‌లైన్లో ఎగ్జామ్ పేపర్స్‌పై చర్చించడం, షేర్ చేయడం నేరమని తెలిపింది. ఇలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయంది. దేశవ్యాప్తంగా పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అవకతవకలు నివారించడానికి కేంద్రం ఇటీవల పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జైలు శిక్ష, భారీ ఫైన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని SSC హెచ్చరించింది.
News September 9, 2025
10 పోస్టులకు APPSC నోటిఫికేషన్

AP: అటవీ శాఖలో 10 ఠాణేదార్ (అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌తో సమానం)పోస్టులకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 1 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఎగ్జామ్ ఉంటుందని, త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని APPSC పేర్కొంది. పూర్తి వివరాలు, ఎగ్జామ్ సిలబస్ కోసం ఇక్కడ <