News September 5, 2024
YCP MLC లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్

AP: టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇదే కేసులో వైసీపీ నేతలు జోగి రమేశ్, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ కోసం అధికారులు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. YCP మాజీ MP నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్ పడింది.
Similar News
News January 9, 2026
UP: 30ఏళ్లు పాక్ మహిళ ప్రభుత్వ ఉద్యోగం.. చివరికి

పాకిస్థానీ నేషనాలిటీని దాచేసి UPలో 30 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసిన మహిళ బండారం బయటపడింది. దీంతో ఆమెను అధికారులు సస్పెండ్ చేయగా, పోలీసులు FIR నమోదు చేశారు. మహీరా అక్తర్(ఫర్జానా) 1979లో పాకిస్థానీని పెళ్లాడి అక్కడి పౌరసత్వాన్నీ పొందింది. విడాకుల తర్వాత IND వచ్చి 1985లో ఓ లోకల్ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఫేక్ సర్టిఫికెట్లతో టీచర్ జాబ్ సాధించింది. తాజాగా విద్యాశాఖ దర్యాప్తులో ఆమె ముసుగు తొలిగింది.
News January 9, 2026
‘క్రిమినల్ ఎంటర్ప్రైజ్’.. లాలూ ఫ్యామిలీపై ఢిల్లీ కోర్టు!

‘Land for jobs scam’ కేసులో RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. CBI ఛార్జ్‌షీట్ ప్రకారం.. లాలూ ఫ్యామిలీ ఒక ‘క్రిమినల్ ఎంటర్ప్రైజ్’లా పనిచేసిందని న్యాయమూర్తి అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు రాయించుకున్నారు అనడానికి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. లాలూతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సహా మొత్తం 46 మందిపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించారు.
News January 9, 2026
మిస్సయిన ఫోన్‌ను నిమిషాల్లో గుర్తించారు!

సాధారణంగా ఫోన్ పోయిందంటే దొరకడం గగనమే అని ఆశలు వదులుకుంటాం. కానీ పోయిన ఫోన్‌ను క్షణాల్లో చేతిలో పెట్టి ఔరా అనిపించారు బెంగళూరు పోలీసులు. ఓ కాలేజీ విద్యార్థిని తన ఫోన్ పోయిందని ‘112’కు ఫిర్యాదు చేశారు. కేవలం 8 నిమిషాల్లోనే లొకేషన్‌కు చేరుకున్న పోలీసులు GPS సాయంతో ఫోన్‌ను రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. అందుకే ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.


