News May 26, 2024

ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు వైసీపీ ఎంపీ కృష్ణయ్య మద్దతు

image

TG: గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు YCP రాజ్యసభ సభ్యుడు, BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు R.కృష్ణయ్య తెలిపారు. సమస్యలు, అవినీతిపై ప్రశ్నించే అభ్యర్థి నవీన్‌ను కులాలు, పార్టీలకు అతీతంగా గెలిపించాలని పిలుపునిచ్చారు. INC, YCPకి ఉప్పూనిప్పుగా ఉన్న పరిస్థితుల్లో కృష్ణయ్య ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. BC నేతగా ఆయన ఈ పిలుపునివ్వగా, YCP ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Similar News

News February 10, 2025

చైనా సంక్షోభం: పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరుగుతున్నాయ్

image

చైనాలో పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరగడం ఆందోళనకరంగా మారింది. 2024లో 61L వివాహాలు నమోదయ్యాయి. 1986 తర్వాత ఇదే అత్యల్పం. 2023తో పోలిస్తే 20.5% తగ్గడం గమనార్హం. ఇక గత ఏడాది 26L జంటలు డివోర్స్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 28K అధికం. అలాగే ఆ దేశంలో శ్రామిక జనాభా(16-59yrs) 68L తగ్గిందని ఓ నివేదికలో వెల్లడైంది. మొత్తం జనాభాలో 60ఏళ్లకు పైగా వయసున్న వారు 22 శాతానికి పెరిగారని తేలింది.

News February 10, 2025

టీచర్ ఉద్యోగ నియామకాల ఆలస్యం.. హైకోర్టు ఆగ్రహం

image

TG: DSC-2008 నియామకాల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1,382 మందిని ఇవాళ్టిలోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని <<15354548>>ఆదేశించినా<<>> అమలు చేయకపోవడంతో విద్యాశాఖపై మండిపడింది. కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాదిని హెచ్చరించింది. మూడు రోజుల్లోగా ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖ కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది.

News February 10, 2025

20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్: చంద్రబాబు

image

AP: PM సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM చంద్రబాబు వెల్లడించారు. 2కిలోవాట్ల వరకు SC, STలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని చెప్పారు. ఈ పథకం అమల్లో బ్యాంకులూ భాగస్వామ్యం కావాలని బ్యాంకర్లతో భేటీలో CM కోరారు. ఈ పథకంతో అవసరాలకు ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.

error: Content is protected !!