News June 2, 2024
సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్
AP: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై హైకోర్టు <<13358298>>తీర్పును<<>> సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అధికారిక సీల్, హోదా లేకున్నా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తూ రేపు తమ పిటిషన్ విచారించాలని YCP సుప్రీంకోర్టును కోరింది. కాగా ఎల్లుండి కౌంటింగ్ జరగనుంది.
Similar News
News September 18, 2024
పండగ ముందు సామాన్యుడికి షాక్.. రూ.170కి చేరిన వంట నూనె
వంట నూనె ధరలు పెరగడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు రెండు రోజుల వ్యవధిలోనే లీటర్‌కు రూ.15-20 పెరిగాయి. పిండి వంటలకు ఎక్కువగా ఉపయోగించే వేరుశనగ నూనె గరిష్ఠంగా రూ.170కి చేరింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.
News September 18, 2024
Stock Market: ఐటీ షేర్లు విలవిల
స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఐటీ సూచీ 2% మేర పతనమవ్వడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడమే ఇందుకు కారణం. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత నిర్ణయం వెలువడే వరకు సూచీల గమనం ఇంతేనని విశ్లేషకులు అంటున్నారు. BSE సెన్సెక్స్ 83,138 (+26), NSE నిఫ్టీ 25,427 (+10) వద్ద ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫీ, టీసీఎస్, LTIM, విప్రో షేర్లు విలవిల్లాడుతున్నాయి. హీరోమోటో 3% వరకు పెరిగింది.
News September 18, 2024
రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా సాయం చేస్తున్నాం: సీఎం
AP: రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ వరదల సమయంలో 10 రోజులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌నే సచివాలయంగా మార్చుకుని పనిచేశామని, నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ ఇవ్వని స్థాయిలో సాయం చేస్తున్నామని ట్వీట్ చేశారు. బాధితులకు ఇచ్చే పరిహారానికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు.