News December 14, 2024
వైసీపీ నిరసనలు శుక్రవారం మాత్రమే: మంత్రి సత్యకుమార్

AP: వైసీపీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్విటర్లో సెటైర్లు వేశారు. ‘డిసెంబర్ 13న శుక్రవారం, డిసెంబర్ 27న శుక్రవారం, జనవరి 3న శుక్రవారం. తమ నిరసనలు, పోరుబాటల్లాంటి రాజకీయ కార్యకలాపాలకు ప్రతీ వారం కేవలం “శుక్రవారం” రోజునే వైసీపీ ఎన్నుకోవడం పూర్తిగా యాదృచ్ఛికమే. ఎటువంటి మతలబు లేదు. సాకులు చూపే ఉద్దేశం అసలే లేదు’ అని పేర్కొన్నారు. దానికి జైలు పక్షి అని హాష్‌ట్యాగ్ జతచేయడం గమనార్హం.
Similar News
News November 22, 2025
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అబ్జర్వర్‌గా నవీన్ కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పంతంగిలో జరగబోయే అండర్ – 17 బాలబాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను పర్యవేక్షించడానికి జడ్.పి.హెచ్.ఎస్ భూషణరావుపేట ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వీ. నవీన్ కుమార్‌ను రాష్ట్ర ఎస్ జీ ఎఫ్ క్రీడల అధికారిని ఉషా రాణి నియమించారు. ఈ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ వారు అభినందించారు.
News November 22, 2025
షూటింగ్లో గాయపడిన హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్లో శ్రద్ధా నటిస్తున్నారు.
News November 22, 2025
6 నెలల్లో అమరావతి రైతుల సమస్య పరిష్కారం: కమిటీ

AP: అమరావతి రైతుల సమస్యలను 6నెలల్లోగా పరిష్కరిస్తామని త్రీమెన్ కమిటీ హామీ ఇచ్చింది. 98% ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, ఇంకా 700 ఎకరాలపై సమస్య ఉందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పరిశీలన తర్వాత జరీబు, మెట్టభూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. లంకభూములపై గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు FEBలో వచ్చే అవకాశముందన్నారు. 719 మందికి మాత్రమే ఇంకా ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి నారాయణ చెప్పారు.


