News December 14, 2024

వైసీపీ నిరసనలు శుక్రవారం మాత్రమే: మంత్రి సత్యకుమార్

image

AP: వైసీపీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్విటర్లో సెటైర్లు వేశారు. ‘డిసెంబర్ 13న శుక్రవారం, డిసెంబర్ 27న శుక్రవారం, జనవరి 3న శుక్రవారం. తమ నిరసనలు, పోరుబాటల్లాంటి రాజకీయ కార్యకలాపాలకు ప్రతీ వారం కేవలం “శుక్రవారం” రోజునే వైసీపీ ఎన్నుకోవడం పూర్తిగా యాదృచ్ఛికమే. ఎటువంటి మతలబు లేదు. సాకులు చూపే ఉద్దేశం అసలే లేదు’ అని పేర్కొన్నారు. దానికి జైలు పక్షి అని హాష్‌ట్యాగ్ జతచేయడం గమనార్హం.

Similar News

News January 24, 2025

650 పోస్టులు.. ఎంపికైన వారి లిస్టు విడుదల

image

TG: అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్టును TGPSC విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ప్రొవిజినల్ లిస్టును <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచింది. మొత్తం 650 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది.

News January 24, 2025

ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్య నిషేధం

image

మధ్యప్రదేశ్(MP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ సహా 17 ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్యం పూర్తిగా నిషేధించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రను కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలను సీఎం నొక్కి చెప్పారు. కాగా గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉంది.

News January 24, 2025

RRR కేసు.. తులసిబాబుకు కస్టడీ

image

AP: రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు కోర్టు కస్టడీ విధించింది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో అతడు A-6గా ఉన్నారు. కాగా తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.