News October 3, 2024

కేసులకు YCP శ్రేణులు భయపడొద్దు: జగన్

image

AP: వైసీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటాలు చేయాలని, కేసులకు భయపడొద్దని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో పశ్చిమగోదావరి నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తోంది. వైసీపీ, టీడీపీ పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందన్నదానిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 9, 2024

PHOTO: ‘సార్ పుణ్యమా అంటూ DSCలో జాబ్ వచ్చింది’ అని దండం

image

TG: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. ‘సార్ పుణ్యమా అంటూ డీఎస్సీలో జాబ్ వచ్చింది’ అంటూ ఓ వ్యక్తి ఎల్బీ స్టేడియంలోని సీఎం ఫ్లెక్సీకి దండం పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

News October 9, 2024

కేంద్రం బ్యాన్ చేసిన యాప్.. ఎన్నికల సంఘం వాడుతోంది!

image

కేంద్రం 2020లో 59 చైనా యాప్స్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. డాక్యుమెంట్లను కెమెరాతో స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్‌లా సేవ్ చేసుకునేందుకు ఉపకరించే క్యామ్‌స్కానర్ కూడా వాటిలో ఉంది. దీన్నుంచి కూడా చైనాకు సమాచారం వెళ్తోందన్న ఆరోపణలున్నాయి. అలాంటి ఈ యాప్‌ను స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘమే వాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి పోస్ట్ పెట్టగా దానిపై చర్చ జరుగుతోంది.

News October 9, 2024

GREAT: 18 ఏళ్లకే ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కేశాడు!

image

నేపాల్‌కు చెందిన నిమా రింజీ షెర్పా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 8వేల మీటర్లకంటే ఎత్తున్న 14 శిఖరాలనూ 18 ఏళ్లకే అధిరోహించారు. బుధవారం ఉదయం టిబెట్‌లోని 8027 మీటర్ల ఎత్తున్న శీష పంగ్మా పర్వత శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఈ రికార్డును అందుకున్నారు. ఈ పర్వత శిఖరాలను సమీపించేకొద్దీ మనిషికి సరిపడా ఆక్సిజన్ ఉండదు. ఈ నేపథ్యంలో ఈ 14 శిఖరాలను అధిరోహించడాన్ని పర్వతారోహకులు గొప్పగా చెబుతారు.