News November 26, 2024

YCP సర్కార్ సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు చేసింది: పవన్

image

AP: వైసీపీ ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనం, పారదర్శకత లేకుండా పాలించిందని Dy.CM పవన్ కళ్యాణ్ విమర్శించారు. సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘చంద్రబాబు, లోకేశ్, నన్ను ఇబ్బంది పెట్టినవారిని శిక్షించాలని మీడియా కూడా కోరుకుంటోంది. వారిని పట్టుకోవటంలో తటపటాయింపు ఎందుకని అడుగుతోంది. కానీ నేనేం హోంమంత్రిని కాదు. ఆ విషయం పోలీసులే చూసుకుంటారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News September 19, 2025

నేటి అసెంబ్లీ అప్‌డేట్స్

image

AP: నేడు ఉ.10 గం.కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గం.కు క్యాబినెట్ సమావేశమై సభలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.

News September 19, 2025

23 రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

image

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (<>కోల్‌కతా<<>>) 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌తో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 3.

News September 19, 2025

రూ.25వేల వరకూ స్కాలర్‌షిప్.. అప్లై ఇలా!

image

కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మిక పిల్లలకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. 2025-26AYకి సంబంధించి ప్రస్తుతం ఆన్‌లైన్ <>దరఖాస్తులు<<>> తీసుకుంటోంది. 1-10 తరగతుల వారు ఈ నెల 30లోపు, ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారు అక్టోబర్ 31లోపు అప్లై చేసుకోవచ్చు. 1-4 తరగతుల వారికి ఏడాదికి ₹1000, 5th-8th ₹1,500, 9th, 10thకు ₹2K, ఇంటర్‌కు ₹3K, డిగ్రీ, ITI, ఇతర కోర్సులకు ₹6K, B.Tech తదితర కోర్సులకు ₹25K ఇవ్వనుంది.