News April 12, 2025
గోశాలలో ఆవుల మరణంపై YCP దుష్ప్రచారం: నారాయణ

AP: టీటీడీ గోశాలలో వందలాది ఆవులు మరణించడం అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నింది. తప్పుడు ప్రచారంతో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చాలని చూసింది. ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టే ఆ పార్టీ పతనమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 28, 2025
వరల్డ్లోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహం.. నేడు ప్రారంభించనున్న మోదీ

ద.గోవాలోని శ్రీసంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77అడుగుల శ్రీరాముడి కంచు విగ్రహాన్ని PM మోదీ నేడు సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ రూపకర్త రామ్ సుతార్ తల్పోణ నదీ తీరంలో దీన్ని రూపొందించారు. మఠం స్థాపించి 550ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గోవా గవర్నర్ అశోక్ గాజపతిరాజు, CM ప్రమోద్ సావంత్ విగ్రహ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
News November 28, 2025
పశువులకు మూతిపుండ్ల వ్యాధి ముప్పు!

AP: ఇటీవల కురిసిన వర్షాల వల్ల పాడి పశువులు మూతి పుండ్ల వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని.. పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకులు దామోదర్నాయుడు సూచించారు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో తీవ్రమైన జ్వరం, నాలుక నీలి రంగులోకి మారడం, నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం, దాణా తీసుకోకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, నీరసం, పాల ఉత్పత్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
News November 28, 2025
2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: సీఎం

AP: రాజధాని అమరావతికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇలాంటి ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదన్నారు. బ్యాంకుల ఏర్పాటు ద్వారా 6541 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 2028 మార్చికి పూర్తయ్యేలా అమరావతి పనులు సాగుతున్నాయని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఎంతగానో సహకరిస్తున్నారని కొనియాడారు.


